AP 10th Exams Pattern: ఏపీలోని అన్ని స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పు చోటుచేసుకోనుంది. ముఖ్యంగా 9, 10 తరగతి పరీక్షా విధానంలో మార్పులు రానున్నాయి. ఇకపై ఈ రెండు తరగతుల పరీక్షల మార్కులు మారనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో తొమ్మిది, పదో తరగతి పరీక్షల్లో మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న సబ్జెక్ట్‌కు వంద మార్కుల పద్ధతి మారనుంది. ఇకపై ప్రతి సబ్జెక్టు 80 మార్కులకే ఉంటుంది. రాష్ట్రంలో ఎన్‌సీఈఆర్‌టి సిలబస్ అమలు చేస్తున్న క్రమంలో మార్కుల విదానం మార్చేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. అంటే 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. మరో 20 మార్కులు ఇంటర్నెల్‌గా ఉంటాయి. సీబీఎస్ఈ విధానంలో ఉండే ఇంటర్నల్ విధానం ఇకపై ఏపీలో అమలు కానుంది. రాష్ట్రంలో అటు సిలబస్, ఇటు పరీక్షలు రెండూ సీబీఎస్ఈ విధానంలో మారనున్నందున ఇంటర్నల్ విధానం అమలు కానుంది. ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ మార్కులు ఇచ్చుకుంటున్నాయనే కారణంతో 2019లో రద్దు చేసిన ఈ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టనున్నారు. 


అయితే ఇంటర్నల్ మార్కుల్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వేసుకోకుండా ఉండేందుకు పగడ్బందీ విధానం కోసం ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఫార్మేటివ్ విధానంలో మార్పు చేసింది. పార్మేటివ్ 3 వరకూ రాత పరీక్షకు 20, ప్రాజెక్టులకు 10, విద్యార్ధి స్పందనకు 10, నోట్ బుక్స్‌కు 10 మార్కులు కేటాయించేవారు. ఇప్పుడీ మార్కుల్ని మార్చింది. రాత పరీక్ష వెయిటేజ్ పెంచింది. ప్రస్తుతం ఇంటర్నల్ మార్కుల విధానం 8వ తరగతి వరకూ అందుబాటులో ఉంది. ఇకపై 9, 10 తరగతులకు కూడా ఈ విధానం అమలు కానుంది. అంటే ఇకపై పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 80 మార్కులకే ఉంటాయి. మిగిలిన 20 మార్కులు పాఠశాల స్థాయిలో రాసిన పరీక్షల్ని బట్టి కేటాయించనున్నారు. 


Also read: AP Aarogyasri Services: భారీగా బకాయిలు, రేపట్నించి ఆగిపోతున్న ఆరోగ్య శ్రీ సేవలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.