AP Aarogyasri Services: ఏపీలో రేపట్నించి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు నిలిచిపోనున్నాయి.పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తాయి, రేపు జనవరి 6 నుంచి అటు ఆరోగ్య శ్రీ, ఇటు ఈహెచ్ఎస్ రెండూ ఒకేసారి నిలిపివేస్తున్నట్టు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఏపీలో పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయకుంటే ఆరోగ్య శ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. రేపట్నించి ఇకపై ఈ రెండు సేవలు అందించలేమని స్పష్టం చేశాయి. బకాయిల భారాన్ని మోయలేకపోతున్నామని తెలిపాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక 1500 కోట్ల బిల్లులు విడుదల చేసినా, ఇంకా 3 వేల కోట్ల బకాయిలున్నాయని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. తక్షణం బకాయిలు చెల్లించకుంటే ఆసుపత్రులు నడపలేమన్నారు. ఓవర్ డ్రాఫ్ట్ కారణంగా బ్యాంకులు సైతం సహకరించడం లేదన్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం తలపెట్టిన ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
వాస్తవానికి ఏపీలో ఆరోగ్యశ్రీ పధకాన్ని రీప్లేస్ చేసేందుకు కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఆరోగ్య శ్రీ పధకం స్థానంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలోని 1 కోటి 43 లక్షల కుటుంబాల్లో ఉన్న 4 కోట్ల 30 లక్షలమందికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా 25 లక్షల పరిమితితో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైబ్రిడ్ విధానంలో బీమా, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, ఏపీలోని ఎన్టీఆర్ వైద్య సేవ అనుసంధానం కానున్నాయి. ఈ విధానంలో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ విధానంలో నిపుణులైన బీమా కంపెనీల్ని భాగస్వామ్యం చేయనున్నారు.
2.5 లక్షల్లోపు క్లెయిమ్స్ కోసం బీమా పద్ధతిలో మారేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 61 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇప్పటికే 5 లక్షల వరకూ వైద్య సేవలు అందుతున్నాయి. దీనిని హెల్త్ ఇన్సూరెన్స్ స్కీంలో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే పలు బీమా కంపెనీలు, ఆసుపత్రులతో చర్చలు జరిపింది ప్రభుత్వం. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
Also read: AP New Airports: ఏపీలో మరో 7 కొత్త విమనాశ్రయాలు, ఎక్కడెక్కడో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.