AP Health Insurance: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక సూపర్ సిక్స్ హామీల సంగతేమో గానీ అందరికీ చేరువైన ప్రతిష్ఠాత్మక ఆరోగ్యశ్రీ పధకం మాత్రం దూరమౌతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పధకం అమలు కావడం లేదు. ఆరోగ్య శ్రీ స్థానంలో కొత్త బీమా వైద్య విధానం అమల్లోకి తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ నుంచి ప్రారంభమై దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ప్రతిష్ఠాత్మ ఆరోగ్య శ్రీ పధకం ఇక అటకెక్కనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ పధకం మూలనపడింది. అయితే ఈ స్థానంలో బీమా ఆరోగ్య విధానం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో 1 కోటి 43 లక్షల కుటుంబాల్లో 4 కోట్ల 30 లక్షలమంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 25 లక్షల వరకూ వైద్య సహాయం అందుతుందని చెప్పారు. హైబ్రిడ్ విధానంలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆయుష్మాన్ బారత్, ఏపీలోని ఎన్టీఆర్ వైద్య సేవ అనుసంధానం కానున్నాయి. 


కొత్త విధానంలో పేదలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. ఆరోగ్యబీమా పథకాన్ని వీలైనంత ఎక్కువమందికి ప్రయోజనం కలిగేలా తీర్దిదిద్దుతున్నామన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇందులో భాగంగా బీమా కంపెనీలతో చర్చించామన్నారు. 2.5 లక్షల్లోపు క్లెయిమ్స్ కోసం బీమా పద్థతిలో మారనున్నామన్నారు. రాష్ట్రంలోని 61 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ పథకం ద్వారా 5 లక్,ల వరకూ వైద్య సేవలు ఇప్పటికే అందుతున్నాయి. ఇక దీనిని అనుసంధానం చేస్తూ 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకూ వైద్య సేవల ఖర్చుల్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించనుంది. 


రాష్ట్రంలోని 1.43 కోట్ల కుటుంబాలకు ముందుగానే ప్రీమియం చెల్లించి ఆరోగ్య భద్రత కల్పిస్తామన్నారు. బీమా ప్రీమియం విధానం వల్ల ఆసుపత్రులకు బిల్లుల పెండింగ్ భయం ఉండదన్నారు. ప్రస్తుతం ప్రీ ఆధరైజేషన్ కోసం 24 గంటలు పడుతున్న సమయాన్ని 6 గంటలకు కుదించేలా చర్చలు జరిగాయన్నారు. ప్రతి కుటుంబానికిి 2500 బీమా ప్రీమియం చెల్లించనుంది ప్రభుత్వం.


Also read: Cold Waves Alert: ఏపీ, తెలంగాణలో పంజూ విసురుతున్న చలి, సంక్రాంతి వరకూ ఇంతే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.