Cold Waves Alert: ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో రోజురోజుకూ ఉష్ణోగ్రత పడిపోతోంది. చలి కారణంగా ఉదయం 9 గంటల వరకూ లేదా సాయంత్రం 6 దాటాక బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చలి గాలులు, చలి తీవ్రతపై వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రానున్న వారం రోజుల్లో రెండు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగనుందని సూచించింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పెరిగిపోయింది. అటు పగటి ఉష్ణోగ్రత, రాత్రి ఉష్ణోగ్రతలు రెండూ తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారుతోంది. తెలంగాణలో అదిలాబాద్, భద్రాచలం ప్రాంతాల్లోనూ, ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ చలి తీవ్రత అధికమైంది. పొగమంచు కూడా ఎక్కువగా ఉంటోంది. రానున్న వారం రోజులు ఉష్ణోగ్రత కనిష్ట స్థాయికి పడిపోవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ రెండు రాష్ట్రాల్లోనూ గతంలో ఎన్నడూ లేనంతగా చలి పెరిగిపోయింది. రెండ్రోజుల్నించి పరిస్థితి మరింత పడిపోయింది. చలికాలంగా ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో చలితీవ్రత మరింత పెరగవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో హై అలర్ట్ జారీ అయింది. కొమురం భీమ్, నిర్మల్, అదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అదిలాబాద్ జిల్లాల్లో నిన్న కనిష్టంగా 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్టంగా నల్గొండలో 17 డిగ్రీలు నమోదైంది. ఇక ఖమ్మంలో 16.6 డిగ్రీలు, భద్రాచలంలో 16.5 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 16.4, నిజామాబాద్ జిల్లాలో 14.4 డిగ్రీలు, దుండిగల్‌లో 13.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 13.6 డిగ్రీలు, హన్మకొండలో 13 డిగ్రీలు, రామగుండంలో 12.8 డిగ్రీలు, పఠాన్ చెరువులో 8.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 10 డిగ్రీలు నమోదైంది.
రానున్న వారం రోజులు చలి తీవ్రత ఇలాగే కొనసాగనుంది. వచ్చే రెండ్రోజులు మరింత పెరగవచ్చు. అయితే సంక్రాంతి తరువాత రెండు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టనుంది.
Also read: SBI Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ఎస్బీఐలో 14 వేల ఉద్యోగాల భర్తీ/p>
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.