AP Enumerates Flood Damage: దశాబ్దాల తర్వాత కురిసిన అత్యధిక వర్షపాతంతో విజయవాడతోపాటు గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఆస్తి, ప్రాణ, పంట నష్టంస సంభవించడంతో అన్ని వర్గాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద మిగిల్చిన నష్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంచనా వేసింది. అక్షరాల రూ.6,880 మేర నష్టం సంభవించిందని ప్రాథమిక అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: CM Chandrababu Naidu: కష్టాల్లో అండగా ప్రభుత్వం.. ఉచిత బస్సు ప్రయాణం, కూరగాయల ధరలు రూ.2 మాత్రమే


వరద విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. అత్యధికంగా వ్యవసాయం, ఆర్‌ అండ్‌ బీ, నీటి వనరులు, పురపాలక, అర్బన్ తదితర శాఖలకు నష్టం సంభవించింది. ఆర్ అండ్ బీ రూ.2,164.5 కోట్లు, పురపాలక, అర్బన్ రూ.1,160 కోట్లు, రెవెన్యూ శాఖ రూ.750 కోట్ల మేర నష్టం వచ్చిందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపి తక్షణ వరద సహాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. వీలైనంత ఎక్కువగా వరద సహాయం అందుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్


 


 


భారీగా ప్రాణ నష్టం
వరద ప్రభావిత జిల్లాల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 43 మంది చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. వీరిలో ఒక్క ఎన్టీఆర్‌ జిల్లాలోనే 35 మంది చనిపోవడం గమనార్హం.


నష్టం వివరాలు


  • రెవెన్యూ శాఖ రూ.750 కోట్లు

  • పశు సంవర్ధక శాఖ 11.58 కోట్లు

  • మత్స్య శాఖ 157.86 కోట్లు

  • వ్యవసాయ శాఖ 301.34 కోట్లు

  • ఉద్యాన శాఖకు 39.95 కోట్లు

  • విద్యుత్ శాఖ రూ.481.28 కోట్లు

  • ఆర్ అండ్ బీ రూ.2,164.5 కోట్లు

  • గ్రామీణ నీటి సరఫరా రూ.75.59 కోట్లు

  • పంచాయతీ రోడ్లు రూ.167.55 కోట్లు

  • నీటి వనరులు రూ.1,568.55 కోట్లు

  • పురపాలక, అర్బన్ రూ.1,160 కోట్లు

  • అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్‌ రూ.2 కోట్లు


సోమవారం నుంచి గణన
ప్రాథమిక అంచనా వేసిన ప్రభుత్వం సోమవారం నుంచి మూడ్రోజులపాటు వరద నష్టం అంచనా వేయనుంది. వరద పీడిత ప్రాంతాల్లో సోమవారం నుంచి మూడు రోజులపాటు నష్టం గణన జరుగుతుందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. వరద బాధితులు అందరూ ఇళ్లలోనే అందుబాటులో ఉండి పూర్తి స్ధాయి వివరాల నమోదుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరంలోని 32 డివిజన్లలో 149 సచివాలయాల పరిధిలో 2 లక్షల నివాసాలలో నష్టం గణన చేపడతామని తెలిపారు.


మూగజీవాలు
వరద ప్రభావిత జిల్లాల పరిధిలో 43 మంది చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. మనుషులతోపాటు మూగజీవాలు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. ఆవులు, గేదెలు, గొర్రెలు ఇతర పశువులు 420, కోళ్లు 62,424 చనిపోయాయని ప్రభుత్వం వెల్లడించింది. 1.93 లక్షల హెక్టార్లలో వరి ఇతర పంటలు, 25 హెక్టార్ల వాణిజ్య పంటలకు నష్టం జరిగిందనేది ప్రాథమిక అంచనాలో పొందుపర్చారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.