Taneti Vanitha comments: కోనసీమ జిల్లాలో అలజడి కొనసాగుతోంది. జిల్లా పేరును మార్చొద్దంటూ జరిగిన నిరసన నిన్న హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆయన ఇల్లు ధ్వంసమైంది. ఆర్టీసీ బస్సులు దగ్ధమైయ్యాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ కొనసాగుతోంది. జిల్లాలోని కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఇప్పటికే ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలో హోంమంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. అడిషనల్ డీజీ, డీఐజీ,ఎస్పీలు, అదనపు బలగాలను పంపించామని చెప్పారు. అమలాపురంలో పరిస్థితి అంతా అదుపులోనే ఉందని..ప్రజలెవరూ కంగరూ పడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. హింసకు పాల్పడిన ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని..ఘటన వెనుక ఎవరు ఉన్న కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 


ఇప్పటివరకు 72 మంది ఆందోళనకారులను పోలీసులు గుర్తించారని..వీరిలో 46  మందిని అరెస్ట్ చేశామని మంత్రి తానేటి వనిత తెలిపారు. మంత్రి విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం సరికాదని..దీనిని ఖండిస్తున్నామన్నారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులపై దాడి చేయడం ఏంటన్నారు. ఆందోళనకారులు దాడులు చేస్తున్నా..పోలీసులు సంయమనం పాటించారని గుర్తు చేశారు. 


ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టిబందోస్తు ఏర్పాటు చేశారన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వైరల్‌గా మారకుండా ఇంటర్‌నెట్ నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. సీఎం జగన్..ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారని మంత్రి వనిత తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు అలర్ట్‌గా ఉంటామన్నారు.


 


Also read:Samantha Dead Post Viral: సమంత డెడ్ పోస్ట్ వైరల్, ఆ తరువాత డిలీట్, కారణమేంటి


Also read:Minister Ktr Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు ఫ్యాక్టరీ..కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి