Samantha Dead Post Viral: సమంత డెడ్ పోస్ట్ వైరల్, ఆ తరువాత డిలీట్, కారణమేంటి

Samantha Dead Post Viral: టాలీవుడ్ స్టార్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రభు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. విభిన్నమైన పోస్టులు, కొటేషన్లతో అభిమానుల్ని ఆకట్టుకుంటుంటుంది. తాజాగా డెడ్ అంటూ పోస్ట్ పెట్టి సంచలనం రేపింది..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 25, 2022, 03:22 PM IST
Samantha Dead Post Viral: సమంత డెడ్ పోస్ట్ వైరల్, ఆ తరువాత డిలీట్, కారణమేంటి

Samantha Dead Post Viral: టాలీవుడ్ స్టార్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రభు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. విభిన్నమైన పోస్టులు, కొటేషన్లతో అభిమానుల్ని ఆకట్టుకుంటుంటుంది. తాజాగా డెడ్ అంటూ పోస్ట్ పెట్టి సంచలనం రేపింది..

పుష్ప సినిమాలో ఊ అంటావా పాటతో క్రేజీగా మారిన స్టార్ నటి సమంత ప్రభు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోంది. ఓ వైపు సినిమాలు..మరోవైపు సోషల్ మీడియా. అస్సలు ఖాళీ ఉండదు. అభిమానుల్ని సందడి చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు విభిన్నమైన పోస్టులు, వ్యాఖ్యలు, మోటివేషన్ కొటేషన్లతో బిజీగా ఉంటుంది. అభిమానుల్ని ఆకట్టుకుంటుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో డెడ్ అంటూ ఓ స్టోరీ పెట్టి సంచలనం రేపింది. అసలేం జరిగింది..

మార్వెల్ సినిమాటిక్ యూనివర్శ్ నుంచి థోర్ సిరీస్ నాలుగవ మూవీ థోర్..లవ్ అండ్ థండర్ సినిమా త్వరలో విడుదల కానుంది. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ చూసిన సమంత ప్రభు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో డెడ్ అని రాసి ఈమోజీలతో థోర్ సినిమా పోస్టర్ షేర్ చేసింది. డెడ్ అని పెట్టడంతో కాస్సేపటికే వైరల్ కాసాగింది. అయితే మరి కాస్సేపటికి ఆ పోస్ట్ కన్పించలేదు. ఆ స్థానంలో..థోర్ సినిమాలో సూపర్ విలన్ బాలే లుక్ షేర్ చేస్తూ ది గాడ్ ఆఫ్ యాక్టింగ్ అని రాసింది. క్రిస్టియన్ బాలే ది డార్క్ నైట్, ది డార్క్ నైట్ రైజెస్ సినిమాల్లో బ్యాట్‌మ్యాన్‌గా అదరగొట్టాడు. ప్రస్తుతం విలన్‌గా చేస్తున్నాడు. డెడ్ అనే పోస్ట్ సమంత ఎందుకు డిలీట్ చేసిందనేది తెలియలేదు. అసలు డెడ్ అని ఎందుకు పెట్టిందనేది చర్చనీయాంశమైంది.

Samantha dead post viral

Also read: Mega family vs Allu Arjun: మెగా వర్సెస్ అల్లు అర్దున్, ఏం పీకలేరు బ్రదర్ అంటూ హ్యాష్‌ట్యాగ్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News