Pavan Kalyan: పవన్ కళ్యాణ్ చేతివేళ్లకు తాబేలు, నాగ బంధనం ఉంగరాలు.. సీఎం సీటు కోసమేనా.. సోషల్ మీడియాలో ఒకటే రచ్చ..
Andhra Pradesh: భీమవరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన స్టైల్ లో ఏపీ సీఎం జగన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. చావో... రేవో తెల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఈ క్రమంలో ఆయన చేతికి తాబేలు, నాగ బంధనం ఉంగరాలపై రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.
Pavan Kalyan Wearing Tortoise- Nagabandhanam Rings: ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాగైన ఈసారి భారీగా సీట్లు గెలవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇటు టీడీపీ, బీజేపీలతో కూడా ఆయన కలిసి నడుస్తున్నారు. అదే విధంగా ఏపీ ఎన్నికలలో ఎవరు గెలిచిన కూడా కీరోల్ ను పోషించే సీట్లు మాత్రం తామే గెలుచుకుని, ప్రభుత్వం ఏర్పాటును శాసించేలా పావులు ముందుకు వేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఆయన ఈ మధ్య తన విమర్శల స్టైల్ ను పూర్తిగా మార్చేశారు.
Read More: Spearmint: పుదీనా తింటున్నారా? అయితే ఈ విషయం మీకు తెలుసా..
దీనిలో భాగంగా.. నిన్న భీమవరంలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీనిలో ఆయన వైఎస్సార్పీపీ పై విరుచుకుపడ్డారు. ఇదే క్రమంలో.. ఆయన చేతికి తాబేలు, నాగ బంధనం బంగారంపు ఉంగరాలు ధరించి ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు జ్యోతిష్యులు.. తాబేలు, నాగ బంధనం ఉంగరాలు ధరించడం వల్ల పవన్ కళ్యాణ్ కు కలిగే యోగాల గురించి ఈ విధంగా చెప్పారు.
తాబేలు ఉంగరం..
తాబేలు ఉంగరం శ్రీ మహవిష్ణువును సూచిస్తుంది. దశావతారంలో కూర్మవతారం. ఇది రాజ్యాధికారం వచ్చేలా చేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. పవర్ కు ఈ మధ్య కాలంలో ప్రజల్తో కాస్తంతా క్రేజ్ తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తాబేలు ఉంగరం ధరించి ఉండవచ్చని అంటున్నారు.
అదే విధంగా.. రాజ్యాధికారం.. ప్రతి పబ్లిక్ మీటింగ్ లను ఆయన ఫ్యాన్స్... సీఎం.. సీఎం.. అంటూ పవన్ కళ్యాణ్ ను ఉత్సాహ పరుస్తుంటారు. కానీ ఈ ఉత్సాహం చూపిన కార్యకర్తలు, ఫ్యాన్స్ లు ఓటు దగ్గర మాత్రం విఫలమౌతున్నట్లు తెలుస్తుంది. ఈసారి ఎలాగైన ఎన్నికలలో ముఖ్య పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.
నాగ బంధనం..
పవన్ కళ్యాన్ జాతకంలో రాహు, కేతు దోషాలున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఆయనకు పలుమార్లు డైవర్స్ అయ్యాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. పవన్ రాశి.. మకర రాశి లో కొన్ని గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. దీంతో ఆయనకు నాగ బంధం ఉంగరం వేసుకుంటే మరింతగా కలసి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.2014లో జనసేన అస్సలు పోటీకి దూరంగా ఉంది. ఆ తర్వాత.. 2019 ఎన్నికల్లోను ఫలితాలు పూర్తిగా రివర్స్ లో వచ్చాయి.
Read More: Ariyana Glory: నేచర్ లో అందాల అరబోస్తూ రచ్చ చేస్తున్న అరియానా, ఫిక్స్ వైరల్
ఈ క్రమంలో ఎలాగైన ఈ సారి ఏపీ ఎన్నికలలో రాజ్యాధికారం సాధించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నమ్మకాలు,సెంటి మెంట్ల గురించి కొట్టిపట్టించుకోని జనసేనాని ఇప్పుడు ఇలా చేతికి తాబేలు, నాగ బంధం ఉంగం ధరించడం ఇటు ఆయన ఫ్యాన్స్ లలోను, అటూరాజకీయాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook