AP Election Polling 2024: ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం.. ఆ నియోజకవర్గంలో అత్యధికం అంటే..
Andhra Pradesh Election Polling 2024 : దేశ వ్యాప్తంగా నాల్గో దశలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికల క్రతవు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదు అయిందే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
Andhra Pradesh Election Polling 2024 : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, అరుణాల ప్రదేశ్, ఒడిషాల రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఏపీల అసెంబ్లీలకు ఎన్నికలు లోక్ సభతో పాటు పూర్తయ్యాయి. ఒడిషాలో మాత్రం నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 4వ విడత నుంచి 7వ విడతల్లో 4 దశల్లో అక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక నిన్నటితో ఏపీలో ఎన్నికల ప్రక్రియ పూర్తైయింది. దాదాపు ఏపీలో 78.25 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఈసీ ప్రకటించింది. ఇక లోక్ సభ వారీగా ఏయే నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. అమలాపురంలో అత్యధికంగా 83.19 శాతం నమోదు అయింది. విశాఖ పట్నంలో అత్పల్పంగా 68 శాతం నమోదు అయింది.
అమలాపురం (SC) - 83.19 %
అనకాపల్లి - 78.47 %
అనంతపురం - 78.50 %
అరకు - 69.26 %
బాపట్ల (SC) - 82.90 %
చిత్తూరు (SC)- 82.36 %
ఏలూరు - 83.04%
గుంటూరు - 75.74 %
హిందూపుర్ - 81.38 %
కడప - 78.72 %
కాకినాడ -76.37 %
కర్నూలు - 76.17 %
మచిలీపట్నం - 82.20 %
నంద్యాల - 79.60 %
నర్సరావు పేట - 78.70 %
నెల్లూరు - 77.38 %
ఒంగోలు - 81.87 %
రాజమండ్రి -79.31 %
రాజంపేట -79.31 %
శ్రీకాకుళం -73.67 %
తిరుపతి (SC) - 75.72 %
విజయవాడ - 78.76 %
విశాఖపట్నం - 68.00 %
విజయ నగరం - 80.06 %
అత్యధిక పోలింగ్ నమోదు కావడంపై ఎవరికీ వారే తమకు అనుకూలమని లెక్కలు వేస్తున్నారు. వాస్తవానికి 2019లో 79-80 శాతం మధ్యలో నమోదై అప్పుడున్న ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపింది. అంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా 2009 కంటే ఎక్కువ పోలింగ్ నమోదై తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు కారణమైంది. అయితే ఈసారి పోలింగ్ 778.25 శాతం వరకు నమోదు కావడంపై ఎవరికి అనుకూలమనే అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇంతకీ విజేతలు ఎవరనేది తేలాలంటే జూన్ 4 ఎన్నికల కౌంటింగ్ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే.
Also read: AP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook