Fire breaks out in a boat at Kakinada coast: కాకినాడ తీరంలో  వేటకు వెళ్తున్న మత్స్యకారుల బోటులో అగ్నిప్రమాదం  సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా బోటులో మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో పడవలో 11 మంది జాలర్లు చిక్కుకున్నారు. దీంతో వారు కోస్ట్ గార్డు సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు తీవ్రత పెరగడంతో మత్స్యకారులు  లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకేశారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న కోస్ట్ గార్డు సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్కూ ఆపరేషన్ నిర్వహించారు. సముద్రంలో కొట్టుకుపోతున్న 11 మందిని అధికారులు సురక్షితంగా కాపాడారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం ఉదయం 09 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లే సమయంలో వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ ను  వెంట తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో వీరు కూడా సిలిండర్ ను వారి వెంట తీసుకెళ్లారు. మత్స్యకారులు తమ వేటను ముగించుకుని తిరిగి వస్తుండగా బోటులో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు అంటుకున్నాయి. ముఖ్యంగా బోటు ముందు భాగంలో అగ్ని కీలలు పూర్తిగా వ్యాపించి.. వెనుక భాగం అంతా పొగతో కమ్మేయడంతో వారు వెంటనే నీటిలోకి దూకేశారు. సమయానికి కోస్ట్ గార్డు సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని రక్షించారు. 


Also Read: Vegetable-Chicken Prices: కొండెక్కిన కూరగాయలు.. భారీగా దిగొచ్చిన కోడి మాంసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook