Vegetable-Chicken Prices: కొండెక్కిన కూరగాయలు.. భారీగా దిగొచ్చిన కోడి మాంసం..

Vegetable Prices: కార్తీక మాసం ప్రభావం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్రంగా పడింది. నిన్న మెున్నటి వరకు కొండెక్కిన చికెన్ ధరలు భారీగా పతనమయ్యాయి. మరోవైపు కూరగాయలు ధరలు ఆకాశాన్నింటాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2023, 01:19 PM IST
Vegetable-Chicken Prices: కొండెక్కిన కూరగాయలు.. భారీగా దిగొచ్చిన కోడి మాంసం..

Chicken Prices drop in AP and Telangana due to Karthika Masam: కార్తీక మాసం ప్రభావం సామాన్యుడిపై తీవ్రంగా పడింది. ఓ పక్క కూరగాయల ధరలు ఆకాశాన్నింటుతుంటే.. మరోపక్క కోడి మాంసం ధరలు దిగొచ్చాయి. కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో దిగువ, మధ్యతరగతి ప్రజలు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఓ పక్క మిర్చి ఘాటెక్కుస్తుంటే.. మరో పక్క ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. ఏది కొనాలన్నా భగ్గుమండటంతో జనాలు కూరగాయలను కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. 

రైతు బజార్లో బీన్స్ కిలో రూ.80 పలుకుతుంటే.. ఉల్లి రూ.70 నుంచి 60 ధర ఉంది. మునగకాయ కిలో రూ.60, కాకర కాయ రూ.60, క్యాప్సికమ్ రూ. 55, క్యారెట్ రూ.50, టమాటా రూ.45గా ఉంది. ఇక మార్కెట్లో అల్లం ధర రూ. 240కి ఎగబాకింది. కార్తీక మాసంలో కూరగాయలకు రెక్కలు రావడంతో సామాన్య జనం కొనేందుకు జంకుతున్నారు. కిలో కొనాలనుకున్న వారు అర కిలోతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కూరగాయల ధరలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

హిందువులు పరమ పవిత్రంగా భావించే మాసం కార్తీక మాసం. ఇది శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో భక్తులు భక్తిశ్రద్ధలతో శివారాధన చేస్తారు. ఈ నెలలో భక్తులు మాంసహారం ముట్టుకోరు. చికెన్ వాడకం తగ్గడంతో ధరలు భారీగా పతనమయ్యాయి.  మార్కెట్లో నిన్న మొన్నటి వరకు కేజీ చికెన్ 250 నుంచి 300 వరకు ఉండగా.. ఇప్పుడు కేజీ కోడి మాంసం ధర 80 రూపాయలకు దిగొచ్చింది. సుమారు మూడేళ్ల తరువాత చికెన్ ధర దిగి రావడంతో పౌల్ట్రీ వ్యాపారులు, చికెన్ షాపుల యజమానులు తలలు పట్టుకుంటున్నారు. అయితే కార్తీక మాసం పెద్దగా పట్టించుకోని మాంసప్రియులు మాత్రం ఇదే అదునుగా భావించి తెగ కొనుగోళ్లు చేస్తున్నారు. 

Also Read: Surat Chemical Factory Fire: సూరత్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం, 7 మంది సజీవ దహనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News