Ambati Comments: చంద్రబాబు వల్లే పోలవరానికి ఈదుస్థితి..చర్చకు సిద్ధమన్న అంబటి..!
Ambati Comments: ఆంధ్రప్రదేశ్‌లో పోలవరంపై వైసీపీ, టీడీపీ మధ్య వార్ కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చకు సిద్ధమా అంటూ పరస్పరం సవాల్‌లు విసుకుంటున్నారు.
Ambati Comments: ఆంధ్రప్రదేశ్‌లో పోలవరంపై వైసీపీ, టీడీపీ మధ్య వార్ కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చకు సిద్ధమా అంటూ పరస్పరం సవాల్‌లు విసుకుంటున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు..టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమకు సవాల్ విసిరారు. పోలవరం డయాఫ్రం వాల్‌పై చర్చకు రావాలన్నారు. ఎవరి చర్య వల్ల దెబ్బతిందో చర్చ జరగాలని స్పష్టం చేశారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర గోదావరి డెల్టాకు సాగు నీటిని మంత్రి అంబటి రాంబాబు విడుదల చేశారు. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం డయా ఫ్రం వాల్‌పై స్పందించారు. ప్రాజెక్ట్‌పై మేధావులు, ఇంజినీర్లతో చర్చ జరగాలన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మించడం ఏంటని..దీని వల్లే వరదలకు దెబ్బతిందన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయకుండా డయా ఫ్రం వాల్ కట్టడం చారిత్రక తప్పిదమని చెప్పారు.
డయా ఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా..కొత్తది నిర్మించాలా అన్న అంశంపై మేధావులు ,నిపుణులు చర్చించుకుంటున్నారని తెలిపారు. ఏ ప్రాజెక్టు అయినా దశల వారీగానే పూర్తవుతుందని తేల్చి చెప్పారు. తొలి దశను పూర్తి చేయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి అంబటి. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని..ప్రాజెక్ట్ పూర్తికి గడువు లేదని స్పష్టం చేశారు.
ముందు అనుకున్న సమయానికే ఇవాళ గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేశామన్నారు. నీటి విడుదలతో సాగు పనులు మొదలు అవుతాయని మంత్రి అంబటి తెలిపారు. ఈకార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీలు భరత్, గీతతోపాటు ఇతర ఉన్నతాధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.
Also read:Guntur: గుంటూరులో దారుణం... బ్లేడుతో తల్లీకూతుళ్లపై దాడి చేసిన యువకుడు...
Also read:India Corona: దేశంలో కరోనా ఆందోళన కల్గిస్తోందా..? యాక్టివ్ కేసులు ఎన్నంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook