Andhra Pradesh: స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో కష్టమే: మంత్రి గౌతమ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) నిర్వహణపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి (Mekapati Goutham Reddy)గౌతమ్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మరోసారి కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణుల నుంచి హెచ్చరికలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో నవంబరులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమేనని మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
Gowtham Reddy Comments on AP Local Body Elections: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) నిర్వహణపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి (Mekapati Goutham Reddy) గౌతమ్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మరోసారి కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణుల నుంచి హెచ్చరికలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో నవంబరులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమేనని మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలో జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ సమావేశంలో గౌతమ్‌రెడ్డి మాట్లాడారు. Also read: Navratri Day 7: శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు
అయితే బీహార్ (Bihar Elections) వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు తప్పనిసరి కావున అందుకే ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలతో స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదని ఆయన పేర్కొన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుందని.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. Also read: Prabhas Birthday: ‘రాధే శ్యామ్’ స్టన్నింగ్ సర్‌ప్రైజ్ ఇదే..
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (Andhra Pradesh State Election Commission) ఈ నెల 28న రాజకీయపార్టీలతో సమావేశం కానుంది. ఈ మేరకు అన్ని పార్టీలకు కూడా గురువారం సమాచారం అందించింది. ఈ క్రమంలోనే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ రోజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే దసరా తర్వాత నవంబర్, డిసెంబర్‌లో కరోనా సెకెండ్ వేవ్ ఉంటుందన్న నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇటు ప్రభుత్వం (AP Govt), అటు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియాలంటే.. 28వరకు ఆగాల్సిందే. Also read: Tuck Jagadish shooting re-started: టక్ జగదీష్ షూటింగ్ మళ్లీ స్టార్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe