Minister Karumuri Comments: నోరు జారిన ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..ఏంటా కథ..!
Minister Karumuri Comments: ఏపీలో మంత్రుల సామాజిక చైతన్య యాత్ర కొనసాగుతోంది. మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందో మంత్రులు స్వయంగా వివరిస్తున్నారు.
Minister Karumuri Comments: ఏపీలో మంత్రుల సామాజిక చైతన్య యాత్ర కొనసాగుతోంది. మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందో మంత్రులు స్వయంగా వివరిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు తీసుకొస్తామని హామీనిస్తున్నారు. బహిరంగ సభల ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన సామాజిక చైతన్య యాత్ర..ప్రస్తుతం కృష్ణా జిల్లాలో సాగుతోంది.
ఈక్రమంలోనే గన్నవరంలో సామాజిక చైతన్య యాత్ర సాగింది. ఈసందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభలో మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులంతా టీడీపీ,చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు సంధిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా..మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. ప్రసంగంలో చంద్రబాబు తీరును ఎండగడుతూ వచ్చిన ఆయన ఒక్కసారి మాట జారారు.
సామాజిక చైతన్య యాత్రలో మైక్ అందుకున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..సీఎం జగన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఏ సీఎం అమలు చేయనివిధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో సామాజిక న్యాయం చేస్తున్నారన్నారు. ఈక్రమంలోనే చంద్రబాబుపై విమర్శలను అందుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలు నిర్లక్ష్యంగా గురైయ్యాయని మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే క్రమంలో 'జగన్ ఓ ఔట్ డేటెడ్ పొలిటీషియన్' అంటూ ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే తేరుకున్న మంత్రి..తన మాటలను వెనక్కి తీసుకున్నారు.
Also read:Harmful Food For Men: పురుషులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ఆహార పదార్థాలను తినకపోడమే మంచిది!
Also read:Balakrishna Comments: గుడిని, గుడిలోని లింగాన్ని మింగేసే రకం..జగన్ ప్రభుత్వంపై బాలకృష్ణ ఫైర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook