AP New Cabinet 2024: ఎట్టకేలకు మంత్రిగా పయ్యావుల కేశవ్, ఓడితేనే కాదు గెలిచినా ప్రభుత్వం వస్తుంది
AP New Cabinet 2024: రాజకీయాల్లోనే కాదు ఏ రంగంలో కూడా అదృష్టం తోడుంటేనే రాణించగలుగుతాం. లేదంటే ఉన్నత అవకాశాలు చేజారిపోతుంటాయి. విధి సహకరిస్తేనే అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతుంటాయి. టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ విషయంలో అదే జరుగుతూ వచ్చింది.
AP New Cabinet 2024: రాజకీయాల్లో ఎదగాలంటే డబ్బుంటే సరిపోతుందంటారు చాలామంది. కానీ ఇది అన్నివేళలా కాదు. అంతకుమించి అదృష్టం సహకరించాలి. లేకపోతే ఎంతగా ప్రయత్నించినా ఉన్నత పదవులు కలిసిరావు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విషయంలో ఇన్నాళ్లూ కలిసిరాని అదృష్టం తొలిసారి కలిసొచ్చింది.
ఎన్టీ రామారావు పిలుపుతో తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన పయ్యావుల కేశవ్ 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2004, 2009లో వరుసగా రెండుసార్లు గెలిచారు. తిరిగి 2019లో, ఇప్పుడు 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఇప్పటి వరకూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి కాలేకపోయారు. పయ్యావుల కేశవ్ విషయంలో ఓ నానుడి ప్రాచుర్యంలో ఉంది. పయ్యావుల కేశవ్ గెలిస్తే పార్టీ అధికారంలో రాదనేది ఆ నానుడి. 2004, 2009లో పయ్యావుల కేశవ్ గెలిచినా పార్టీ అధికారంలో రాలేదు. దాంతో మంత్రి పదవికి దూరమయ్యారు. 2014లో పార్టీ గెలిచినా పయ్యావుల కేశవ్ ఓడిపోయారు. దాంతో మరోసారి మంత్రి పదవి దక్కలేదు. 2019లో పయ్యావుల గెలిచినా పార్టీ ఓడిపోయింది. మంత్రి పదవి పోయింది. ఇప్పటి వరకూ ప్రతి ఎన్నికల్లో ఈ నానుడి నిజమవుతూ వచ్చింది.
ఈసారి మాత్రం తొలిసారిగా పయ్యావుల కేశవ్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఇన్నాళ్లూ ప్రాచుర్యంలో ఉన్న నానుడి తప్పని తేలింది. ఈసారి అతనూ గెలిచాడు. పార్టీ అధికారంలో వచ్చింది. ఇంకేముందు ఇన్నాళ్లూ దూరమైన మంత్రి పదవి దక్కింది. తొలిసారిగా పయ్యావుల కేశవ్ అనే నేను అంటూ మంత్రివర్గసభ్యుడిగా ప్రమాణం చేశారు.
ఇక మున్ముందు కూడా పయ్యావుల కేశవ్‌కు అదృష్టం తోడుగా ఉంటుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. కేశవ్‌కు మంత్రివర్గం చోటు లభించడంతో పార్టీలో ఆయనతో పాటు మంత్రిపదవి ఆశించిన కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీతలకు కేబినెట్‌లో స్థానం లభించలేదు.
Also read: Pawan Chiranjeevi: సభపై భావోద్వేగానికి లోనైన పవన్ కల్యాణ్.. చిరంజీవికి పాదాభివందనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook