AP New Cabinet: ఏపీ కొత్త కేబినెట్ మొత్తానికి ఖరారైంది. కాస్సేపట్లో మంత్రివర్గం కొలువుదీరనుంది. పాత, కొత్త కలయికలతో మంత్రివర్గం ఏర్పడింది. ఎవరు ఇన్..ఎవరు అవుట్ అనేది ఫైనల్ అయింది. ఏపీ కొత్త కేబినెట్ జాబితా ఇదే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త కేబినెట్ సిద్దమైంది. వివిధ రకాల సామాజిక సమీకరణాలు, ప్రాంతాల వారీ లెక్కల అనంతరం కొందరికి తిరిగి చోటు దక్కగా..ఇంకొందరు కొత్తగా చేరారు. మరి కాస్సేపట్లో అంటే ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇప్పటికే ఖరారైన మంత్రుల పేర్లను ఏపీ ప్రభుత్వం రాజ్ భవన్‌కు పంపింది. గత మంత్రివర్గం నుంచి 11 మందికి కొత్త మంత్రివర్గంలో మరోసారి అవకాశం లభించింది. మరోవైపు ఒకరు మినహా మిగిలిన ఎస్సీ సామాజికవర్గ మంత్రులంతా కొత్త కేబినెట్‌లో కొనసాగుతున్నారు. 


రెండవసారి అవకాశం దక్కించుకున్న పాత మంత్రులు


గత కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన సిదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, గుమ్మనూరు జయరామ్, కే నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తానేటి వనిత, అంజాద్ బాషాలు కొత్త మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకున్నారు. 


కొత్త మంత్రులు వీరే


చిత్తూరు జిల్లా నుంచి ఆర్ కే రోజా, శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, అనకాపల్లి నుంచి గుడివాడ అమర్‌నాథ్, మాడుగుల నుంచి ముత్యాలనాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి కారుమూరు నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ, గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, విడదల రజని, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పీడిక రాజన్నదొర, కాకినాడ జిల్లా నుంచి దాడిశెట్టి రాజా, కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, బాపట్ల జిల్లా నుంచి మేరుగ నాగార్జున, నెల్లూరు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి, అనంతపురం జిల్లా నుంచి ఉషశ్రీ చరణ్‌లు కొత్తగా మంత్రివర్గంలో చేరారు. 


కాపు సామాజికవర్గం నుంచి ఈసారి గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబులకు ప్రాధాన్యత లభించింది. కమ్మ, వైశ్య, క్షత్రియ సామాజికవర్గాల నుంచి ఈసారి ప్రాతినిధ్యం లేదు. 


Also read: AP Cabinet 2.0: ఏపీ కొత్త కేబినెట్.. 25 మందితో జాబితా రెడీ... లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook