AP Liquor Full Prices: ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది. మద్యం విధానం మార్చేసి అతి తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పిన మాటను ఆచరణలోకి తీసుకువచ్చింది. ఇప్పటికే కొత్త మద్యం విధానం తీసుకురాగా.. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు కూడా ఆహ్వానించారు. 16వ తేదీన కొత్త మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. అయితే ఈ విధానంలో మద్యం ధరలను కూడా భారీగా తగ్గించి అతి తక్కువకే మద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా మద్యం ధరలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరల సవరణపై గెజిట్‌ విడుదల చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan: చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌ ప్రశ్నాస్త్రాలు.. ఇసుక దోపిడీపై నిలదీత


 


ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ ఖరారు చేసి రిటైల్ దుకాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుండడంతో ప్రభుత్వం లిక్కర్ ధరల సవరణపై గెజిట్ జారీ చేయగా.. ఐఎంఎఫ్ఎల్ బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ సవరణ చేసింది.

Also Read: Chandrababu: పండుగ రోజు కూడా పాలనలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ఉల్లి, టమాట ధరపై శుభవార్త


ప్రివిలేజ్ ఫీజు వసూలు
కొత్త మద్యం దుకాణాలకు భారీ స్థాయిలో టెండర్లు దాఖలవగా లాటరీ పద్దతితో దుకాణాలు ఖరారు చేయనున్నారు. దేశంలో తయారయ్యే విదేశీ మద్యం ఐఎంఎఫ్ఎల్ బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ సవరణ చేసింది. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


ధరల సవరణ
ఐఎంఎఫ్ఎల్ బాటిల్ ఎమ్మార్పీ ధర రూ 150.50 ఉంటే దానికి రూ.160 వసూలు చేయనున్నారు. క్వార్టర్ బాటిల్ ధర రూ.90.50గా ఉంటే ఏపీఎఫ్ కలిపి దాని ధర రూ.100 అవుతుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే క్వార్టర్ మద్యం ధర రూ.99గా ప్రకటించిన విషయం తెలిసిందే.


భారీగా దరఖాస్తులు
మద్యం దుకాణాల టెండర్లకు గడువు ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 89,643 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. అయితే గడువు ముగిసే సమయానికి చాలా చోట్ల దరఖాస్తుదారులు లైన్లలో వేచి ఉండడం, కొందరు వ్యాపారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంది. మొత్తం దరఖాస్తులు 90 వేల దాటొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వం రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అయితే రూ.1,800 కోట్లు వచ్చి ఉంటుందని సమాచారం.


అందుబాటులో అన్ని బ్రాండ్లు
ఇప్పటికే దాఖలైన టెండర్లను ఈ నెల 12,13 తేదీలలో పరిశీలన చేయనున్నారు. 14వ తేదీన జిల్లాలలో కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ తీసి టెండర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అనుసరించి ప్రైవేటు మద్యం షాపులు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్ని బ్రాండ్ల మద్యం తిరిగి అన్ని దుకాణాల్లోనూ అందుబాటులోకి రానుండడంతో మందుబాబులు పండుగ చేసుకునే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి