AP Pension Increase: ఆంధ్రప్రదేశ్ లో పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నూతన సంవత్సరం నుంచి ఫించన్ మొత్తాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జగన్ సర్కారు బుధవారం విడుదల చేసింది. వృద్ధులు,  వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు తదితర వారికి ఇవ్వననున్న సామాజిక పెన్షన్లు ఇప్పటి వరకు రూ.2,250గా ఇచ్చిన ప్రభుత్వం.. జనవరి 1 నుంచి రూ.2,500లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెంచిన పెన్షన్లను 2021 డిసెంబరు నుంచి లబ్ధిదారులకు వర్తింపజేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. దీంతో జనవరి 1 న ఇచ్చే పెన్షన్ లోనే డిసెంబరు నెలకు సంబంధించిన పెంపుదలను కలిపి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 


ఈ నేపథ్యంలో వైఎస్సార్ ఫించన్ పథకంలో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులతో పాటు తదితర విభాగాలు దీనికి అర్హత పొందనున్నారు. ఈ పెంపుదలతో ప్రభుత్వంపై అదనంగా 129 కోట్ల రూపాయల మేర భారం పడుతుందని వివరించారు.


కొత్త ఏడాదిలో అనేక కార్యక్రమాలు..


పెన్షన్ల పెంపుదలతో పాటు.. జనవరిలో నిర్వహించే అనేక సంక్షేమ కార్యక్రమాల వివరాలను అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది అనగా 2022 జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా అగ్రవర్ణ నిరుపేద మహిళలకు లబ్ధి చేకూర్చనున్నారు. 


45 నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలకు మూడేళ్లలో రూ.45 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే, జనవరిలోనే రైతు భరోసా సాయం ఇవ్వనున్నట్టు తెలిపారు. రైతు భరోసా సాయం తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.  


Also Read: AP Movie Tickets Issue: సినిమా టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


Also Read: APPSC Jobs: నిరుద్యోగులకు శుభవార్త...670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి