APPSC Jobs: నిరుద్యోగులకు శుభవార్త...670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

APPSC: ఏపీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా రెవెన్యూ, దేవదాయశాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 09:16 PM IST
APPSC Jobs: నిరుద్యోగులకు శుభవార్త...670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

APPSC Jobs 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీలో రెవెన్యూ, దేవాదాయాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (APPSC Job Notifications 2021) రిలీజ్ అయ్యింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ (APPSC ) మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెవెన్యూశాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు (Junior Assistant cum Computer Assistant), దేవాదాయశాఖలో 60 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 19 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.  పూర్తి వివరాల కోసం ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌ చూడండి. 

పోస్టు: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 
ఖాళీలు - 670
దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబరు 30
దరఖాస్తు చివర తేదీ: జనవరి 19, 2022
పే స్కేల్: రూ.16, 1400-రూ.49,870
వయస్సు: 01.07.2021 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 
ఎంపిక; కంప్యూటర్ ఆధారిత పరీక్ష (స్క్రీనింగ్, మెయిన్స్)
వెబ్‌సైట్; https://psc.ap.gov.in  
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాసై ఉండాలి.

Also read: AP Movie Tickets Issue: సినిమా టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పోస్టు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III ఎండోమెంట్స్ సబ్ సర్వీస్ (Executive Officer Grade-III Endowments Sub Service)
ఖాళీలు-60 (13 క్యారీ ఫార్వార్డ్ + 47 ఫ్రెష్)
దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబరు 30
దరఖాస్తు చివర తేదీ: జనవరి 19, 2022
పే స్కేల్: రూ.16, 1400-రూ.49,870
వయస్సు: 01.07.2021 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ
ఎంపిక; స్క్రీనింగ్ టెస్టు-150 మార్కులు
             సెక్షన్-A- జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిలీట్-50 మార్కులు
             సెక్షన్-B- హిందూ ఫిలాసపీ మరియు టెంపుల్ సిస్టమ్- 100 మార్కులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News