Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి పోలీసులు బిగ్ షాక్..
Kodali Nani: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి పోలీసులు షాక్ ఇచ్చారు. మాజీ మంత్రి పుట్టినరోజు సంరద్బంగా అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Kodali Nani: ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని బర్త్ డే సందర్భంగా అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా.. స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు కొడాలి ఫ్యాన్స్ మధ్య మధ్ తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇవాళ జరగాల్సిన కొడాలి నాని పుట్టిన రోజు వేడుకలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
అంతేకాదు వైసీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గుడివాడ పేద ఎరుక పాడులో కూడా కొడాలి ఫ్లెక్సీల ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారు. దీంో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. కొడాలి నాని విషయానికొస్తే.. తెలుగు దేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2004 లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో మరోసారి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆ తర్వాత 2012లో తెలుగు దేశం పార్టీతో విభేదించిన వైయస్ఆర్సీపీలో జాయన్ అయ్యారు. ఆ పార్టీ నుంచి వరుసగా 2014, 2019లో వరుసగా గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గత ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన తన సమీప టీడీపీ అభర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా ప్రస్థానం ప్రారంభించిన తర్వాత తొలిసారి ఎన్నికల్లో ఓటమి రుచి చూసారు. అయితే అధికారంలో ఉన్నంత వరకు తెలుగు దేశం పార్టీకి చుక్కలు చూపించిన కొడాలి నానికి.. తాజాగా స్థానిక టీడీపీ నాయకులు చుక్కులు చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో గుడివాడలో ఓటమి తర్వాత కొడాలి నాని రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. బయటకు కూడా అంతగా రావడం లేదు. మంత్రిగా.. ఎమ్మెల్యేగా జగన్ పాలనలో రెచ్చిపోయిన కొడాలి నాని ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కొడాలి నాని విషయానికొస్తే.. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో ఈయన మంత్రిగా పనిచేసారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..