AP Police Job Notification For SI Posts: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే పోలీసు నియామకాలకు సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదలవగా దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరో కీలక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో 411 సివిల్, రిజర్వ్ ఎస్ఐ పోస్టులు జారీ అయ్యాయి. ఇక ఇవి కాకుండా 6511 సివిల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా విడుదల నోటిఫికేషన్ విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023 ఫిబ్రవరి 19వ తేదీన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇక అదే ఏడాది జనవరి 22వ తేదీన కానిస్టేబుల్ పోస్టులకు కూడా రాత పరీక్ష నిర్వహించబోతున్నారు. ఏపీలో భారీగా పేరుకుపోయిన పోలీసు డిపార్ట్మెంట్ లోని ఖాళీ స్థానాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కొన్ని నెలల నుంచి కసరత్తు చేస్తుండగా గత నెలలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విలువరించేందుకు ఏపీ డీజీపీ ప్రభుత్వాన్ని అనుమతి కూడా కోరారు.


ప్రభుత్వం నుంచి అనుమతి జారీ అవడంతో ఈ ఖాళీలను పూరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో పోలీసు శాఖలో పెద్ద ఎత్తున రిటైర్మెంట్స్ జరుగుతూ ఉండడం,  అలాగే కొన్ని పోస్టులకు ప్రమోషన్లు ఇస్తూ ఉండడంతోపాటు సర్వీస్ లో మరణిస్తున్న పోలీసుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో అనేక ఖాళీలు ఏర్పడుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు పోలీసులకు వీక్లీ ఆఫ్ కూడా ఇస్తుంది. దీంతో సిబ్బంది అవసరం ఏర్పడుతూ ఉండడంతో ఇక తాత్సారం చేయకుండా నియామకాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.


ఇక ఏపీలో ఉద్యోగం అవసరమైన అనేక మంది నిరుద్యోగులు ఈ పోస్టులకు అప్లై చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఎస్సై పోస్టులకు నమోదు చేసుకునే వారు కచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసేవారు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలని నోటిఫికేషన్ పేర్కొన్నారు. ఇక ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్ లో పోలీసు శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి ప్రారంభం నాటికి పోలీసు శాఖలో పోస్టింగ్ ఇవ్వబోతున్నారు. 


Also Read: Supreme Court: అమరావతిపై ఏపీ ప్రభుత్వానికి ఊరట, హైకోర్టు పరిధి దాటిందన్న సుప్రీంకోర్టు


Also Read: Kotamreddy Srinivasulu Reddy: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి.. ఎన్నో అనుమానాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook