TDp-Janasena Alliance: ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల్ని ప్రకటిస్తూ వైనాట్ 175 లక్ష్యంగా సిద్ధం పేరుతో జనంలో దూసుకుపోతోంది. మరోవైపు టీడీపీ-జనసేన అధినేతలు పొత్తు సమీకరణాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. మరోసారి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల లెక్క ఇంకా తేలలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొనసాగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మరోసారి సుదీక్ఘంగా ఈ విషయమై చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చేది చంద్రబాబు దాదాపుగా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ ఇంకా అదనంగా సీట్లు కోరుతుండటంతో చర్చలు కొలిక్కి రాలేదు. కూటమిలో బీజేపీ ఉంటుందా లేదా అనేది ఇంకా తేలనందున కొన్ని సీట్లను రిజర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జనసేనకు 22-25 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రతిపాదించినట్టు సమాచారం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్థానంతో పాటు గోదావరి జిల్లాలు, విశాఖలో అదనంగా కొన్ని సీట్లు ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. ఈ విధంగా 40-45 సీట్లకు పవన్ కళ్యాణ్ అభ్యర్ధుల్ని సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. 


చంద్రబాబు మాత్రం జనసేనకు గోదావరి జిల్లాల్లో 8, విశాఖలో 3, కృష్ణాలో 2, గుంటూరులో 1, ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్క సీటు చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూటమిలో చేరే విషయంపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. సీట్ల సర్దుబాటు ఆలస్యం కావడానికి ఇది కూడా ఓ కారణంగా తెలుస్తోంది.


జనసేన ఇప్పటికే ప్రకటించిన రాజోలు, రాజానగరంతో పాటు వైసీపీ నుంచి పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి అదే స్థానాన్ని ఇవ్వటంపై స్థిరంగా ఉంది. ఫిబ్రవరి 10 వరకూ బీజేపీ కోసం ఎదురు చూసేందుకు రెండు పార్టీల అధినేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అప్పటికీ బీజేపీ ముందుకు రాకుండా సీపీఐతో కలిసి వెళ్లేందుకు టీడీపీ-జనసేనలు సిద్ధమౌతున్నాయి. అయితే టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటు ఎంతకు తెగుతుందనేదే అసలు ప్రశ్న. 


Also read: Sharmila Fever:  అస్వస్థతకు గురైన షర్మిల.. రోడ్‌షో, జిల్లాల పర్యటన వాయిదా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook