AP Corona Cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 4,528 మందికి కొవిడ్​ పాజిటివ్​ (Corona cases in AP) వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 39,816 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది. క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల భారీగా తగ్గాయి.


ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా రాష్ట్రంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. ప్రకాశం జిల్లాలో ఈ మరణం సంభవించినట్లు తెలిపింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,508 మంది కొవిడ్​కు బలయ్యారు.


ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 418 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,63,934 మంది కరోనాను జయించారు.



ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18,313 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.


జిల్లాల వారీగా యాక్టివ్​ కేసులు..


చిత్తురులో అత్యధికంగా 4,020 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. ఆ తర్వాత విశాఖపట్నంలో 3,658 కేసులు, కృష్ణ, పశ్చిమ గోదవావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్​, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో 1000కిపైగా యాక్టివ్​ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. మిగతా అన్ని జిల్లాలోనూ రోజు రోజుకు యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.


ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,17,96,337 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 2,096,755  శాంపిళ్లు పాజిటివ్​గా తేలినట్లు వివరించింది.


మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.


Also read: Paritala Sriram: టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్‌కు కరోనా పాజిటివ్...


Also read: Tadepalligudem: పండుగ పూట విషాదం.. తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook