Paritala Sriram tests Covid 19 Positive: సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా కరోనా అందరినీ చుట్టేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడగా.. తాజాగా మరో పొలిటీషియన్ కరోనా బారినపడ్డారు. టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని శ్రీరామ్ (Paritala Sriram) ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇటీవలి కాలంలో తనను కలిసిన శ్రేయోలాభిషులు, మీడియా మిత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. అందరూ జాగ్రత్తగా ఉండాలని శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. లక్షణాలు కనబడితే టెస్టులు చేయించుకుని జాగ్రత్త పడాలన్నారు. పరిటాల శ్రీరామ్ త్వరగా కోలుకోవాలని పరిటాల అభిమానులు కోరుకుంటున్నారు.
— Paritala Sreeram (@IParitalaSriram) January 14, 2022
కొద్దిరోజుల క్రితమే మంత్రి కొడాలి నాని (Kodali Nani), టీడీపీ నేత వంగవీటి రాధా (Vangaveeti Radha) కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సైతం ఇటీవల కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.
దేశంలో కేవలం 8 రోజుల వ్యవధిలోనే కరోనా (Covid 19 cases in India) రోజువారీ కేసులు 10వేల మార్క్ నుంచి 1లక్ష మార్క్‌ను దాటాయి. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 2 లక్షలు దాటేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే నిపుణులు, పరిశోధకులు అంచనా వేస్తున్నట్లు ఫిబ్రవరి నాటికి కరోనా పీక్స్‌కి చేరవచ్చు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులను నిర్ధారించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఒమిక్రాన్ వేవ్ వచ్చినా డెల్టాతో పోలిస్తే దాని తీవ్రత తక్కువే కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అంతమాత్రానా ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దని డబ్ల్యూహెచ్ఓ, నీతి ఆయోగ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
Also Read: Bangarraju Final Review: బంగార్రాజు రివ్యూ.. ఎలా ఉందంటే?!!
Also read: Rashmi Gautam: కొంటె చూపులు, నడుము అందాలతో మతి పోగొడుతున్న రష్మీ గౌతమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook