AP CRISIS: దేశాలు, రాష్ట్రాల మధ్య సాధారణంగా అభివృద్ది విషయంలో పోటీ ఉంటుంది. క్రీడల్లో అయితే పతకాల కోసం పోటీ ఉంటుంది. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు పోటీ పడి హామీలు ఇస్తుంటాయి. దేశంలో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. అయితే అదే అభివృద్దో, మరో మంచి అంశంలోనే కాదు.. అప్పుల విషయంలో. అవును అప్పులు తీసుకోవడంలో  దేశంలో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడి మరీ దూసుకుపోతున్నాయి. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. కొత్త రుణం తీసుకుంటేనే కాని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అందుకే ఎడాపెడా అప్పులు చేస్తూ పాలన సాగిస్తున్నాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో అత్యధిక రోజులు అప్పులు చేసిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది. 2021- 22 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి ఆర్బీఐ నుంచి తీసుకున్న ఎస్డీఎఫ్( స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ) తీసుకున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ ప్లేస్ లో ఉంది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలోనూ  ఎక్కువ రోజులు రుణం తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే. తక్షణ అవసరాల కోసం ఈ రుణం తీసుకుంటాయి రాష్ట్రాలు. గత ఏడాదిలో 305 రోజుల పాటు ఎస్డీఎఫ్, 283 రోజులు డబ్ల్యూఎంఏ, 146 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ సౌకరాన్ని ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకుంది. ఐసీఆర్ఏ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక ఏపీ తర్వాత ఎక్కువ రోజులు అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ సెకండ్ ప్లేస్ లో ఉంది. మూడో స్థానంలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఉంది. ఎస్డీఎఫ్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఎంత ఎక్కువగా వాడితే.. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా దిగజారినట్లే. దీంతో తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఎకనమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 17 రాష్ట్రాలు ఎస్డీఎఫ్, 14 స్టేట్స్ డబ్ల్యూఎంఏ, తొమ్మిది రాష్ట్రాలు ఓడీ(ఓవర్ డ్రాఫ్ట్) ద్వారా అప్పులు తీసుకున్నాయి. యూపీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఒడిశా,అసొంతో పాటు పేద రాష్ట్రంగా పిలుచుకునే బీహార్ రాష్ట్రం సైతం ఎలాంటి రుణం తీసుకోలేదు. ఇక బెంగాల్, మహారాష్ట్రలు ఒక్క రోజు మాత్రమే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాయి. అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లోనూ కొన్ని... ఎస్డీఎఫ్, డబ్ల్యూఎంఏ, ఓడీలో.. ఏదో ఒక సౌకర్యాన్ని వాడుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు రెండింటిని ఉపయోగించుకున్నాయి. ఆరు రాష్ట్రాలు మాత్రం మూడింటిని వాడుకుని.. రుణం తీసుకున్నాయి. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ సౌకర్యాల ద్వారా అప్పులు తీసుకుంటే.. వడ్డీ రూపంలో ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆర్థికంగా రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మూడు సౌకర్యాలను ఉపయోగించుకుని రుణం తీసుకోవడం అత్యంత ఆందోళకరమని చెబుతున్నారు. ఇది ముందుముందు సంక్షోభానికి దారి తీయవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రజలు శ్రీలంక సంక్షోభ పరిస్థితులను గమనిస్తున్నారు. తిండి లేక అక్కడ జనాలు చనిపోతున్నారు. ప్రభుత్వాల అడ్డగోలు నిర్ణయాలతో తెలుగు రాష్ట్రాల్లోనూ శ్రీలంక తరహా ఆర్థిక పరిస్థితులు తలెత్తుతాయా అన్న కలవరం జనాల్లో కనిపిస్తోంది.


READ ALSO: KCR Tour: అఖిలేష్ మౌనం.. పాలిటిక్స్ లేవన్న కేజ్రీవాల్! ఢిల్లీలో కేసీఆర్ చర్చలు ఉత్తవేనా?
READ ALSO: YCP MLC Ananthbabu: వైసీపీ ఎమ్మెల్సీని కాపాడుతున్నారా? హత్య కేసు నమోదైనా పట్టుకోలేరా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి