AP Heavy Rains: వాయుగుండం ప్రభావం, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్, భారీ వర్షాలు
AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ వాయుగుండంగా మారనుంది. ఫలితంగా దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heavy Rains: ఓ వైపు చలికాలం మరోవైపు వాయుగుండం ప్రభావంతో వర్షసూచన. రానున్న రోజుల్లో ఏపీలో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే ఏపీలో చలి తీవ్రత పెరుగుతోంది. దీనికితోడు బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికలతో భారీ వర్ష సూచన పొంచి ఉంది. రానున్న 4-5 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27 సాయంత్రానికి తుపానుగా మారవచ్చు. తమిళనాడు-శ్రీలంక మధ్యన తీరం దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫలితంగా ఏపీలో మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నెల 27 నుంచి నెలాఖరు వరకూ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
తుపాను కారణంగా దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలో చెదురుముదురు లేదా తేలికపాటి వర్షాలు పడవచ్చు. వాయుగుండం, తుపాను ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాపై ఉంటుంది. దాంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వరకూ గాలులు వీయనున్నాయి. ఈ నెల 29, 30 తేదీల వరకూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచనలు జారీ అయ్యాయి.
ఈ నెల 27 నుంచి దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక రేపు, ఎల్లుండి మాత్రం మోస్తరు వర్షాలు పడవచ్చు. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రత 11 డిగ్రీలకు చేరుతోంది. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోతోంది.
Also read: IPL 2025 Auction: తొలి రోజు వేలం తరువాత ఏ జట్టు వద్ద ఎంత మిగిలింది, ఎవరెవరు ఆటగాళ్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.