AP Weather Report and Temperature : నేడు ఏపీలోని 29 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్. అంబేద్కర్ మీడియాకు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. అనకాపల్లి జిల్లాలో 5 మండలాలు, గుంటూరు జిల్లాలో 1 మండలం, కాకినాడ జిల్లాలో 1 మండలం,  ఎన్టీఆర్ జిల్లాలో 2 మండలాలు, పల్నాడు జిల్లాలో 2 మండలాలు, మన్యం జిల్లాలో 5 మండలాలు, విజయనగరం జిల్లాలో 5 మండలాలు, వైఎస్సార్ జిల్లాలో 8 మండలాల్లో శుక్రవారం భారీగా వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న గురువారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 45.1°C, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, వైస్సార్ జిల్లా బద్వేలులో 45°C అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, వల్లూరు మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 27 మండలాల్లో వడగాల్పులు వీచాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్. అంబేద్కర్ పేర్కొన్నారు.


అలాగే రేపు శనివారం 33 మండలాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని డా. బి.ఆర్. అంబేద్కర్ హెచ్చరించారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు బయటకు రాకుండా ఉండలని సూచించారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 


శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో  44°C - 45°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, SPSR నెల్లూరు కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో  42°C - 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కోనసీమ, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో  40°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్. అంబేద్కర్ హెచ్చరించారు.