AP Weather Report: ఏపీలో ఇవాళ, రేపు ఈ మండలాల్లో భారీగా వడగాల్పులు
AP Weather, Heatwave Report: మంగళవారం అనకాపల్లి 17, కాకినాడ 2, కృష్ణా1, నంద్యాల2, విశాఖపట్టణం 2, విజయనగరం 2, వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీచాయి. బుధవారం, గురువారం ఈ వడగాల్పుల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది.
AP Weather, Heatwave Report: అమరావతి: భారత వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం ఏపీలో బుధవారం 98 మండలాల్లో వడగాల్పులు, గురువారం 70 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలకు సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నాం అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి ఇలాంటి హెచ్చరికలతో కూడిన మెసెజ్‌లు అందినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.
" భారత వాతావరణ కేంద్రం నివేదికల ప్రకారం బుధవారం మన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పు వీచే అవకాశం ఉంది" అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ స్పష్టంచేశారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న 98 మండలాలు సంఖ్య ఇలా ఉంది.
అల్లూరి జిల్లా 7,
అనకాపల్లి జిల్లా 16,
తూర్పుగోదావరి జిల్లా 2,
ఏలూరు జిల్లా 2,
గుంటూరు జిల్లా 3,
కాకినాడ జిల్లా 10,
కృష్ణా జిల్లా 2,
ఎన్టీఆర్ జిల్లా 8,
పల్నాడు జిల్లా 1,
పార్వతీపురంమన్యం 12,
శ్రీకాకుళం 4,
విశాఖపట్నం 2,
విజయనగరం 19,
ఇది కూడా చదవండి : Summer Heatwave Warning: మండుతున్న ఎండలు.. పనివేళల మార్పునకు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
వైఎస్ఆర్ 10 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది అని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. మంగళవారం అనకాపల్లి 17, కాకినాడ 2, కృష్ణా1, నంద్యాల2, విశాఖపట్టణం 2, విజయనగరం 2, వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీచాయి. బుధవారం, గురువారం ఈ వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఇది కూడా చదవండి : Hyderabad: హైదరాబాద్‌లో వడగళ్ల వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK