Free Saree Dhoti: ప్రజలకు భారీ శుభవార్త.. సంక్రాంతికి ఉచితంగా ధోతి, చీరల కానుక

Women And Men Get Free Saree And Dhoti Gift For Sankranthi: హిందూ సంప్రదాయంలోనే అతి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే పండుగ కోసం ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. ప్రజలకు ఉచితంగా పట్టువస్త్రాలు అందించాలని నిర్ణయించింది. మహిళలకు చీర.. పురుషులకు ధోతి ఇచ్చేందుకు సిద్ధమైంది.

1 /9

తెలుగు వారి మాదిరిగానే తమిళనాడు ప్రజలు సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా చేసుకుంటారు. అక్కడ పొంగల్‌ అని పిలుస్తుంటారు.

2 /9

ఈ పండుగ కోసం ప్రజలకు ఉచితంగా పట్టువస్త్రాలు అందించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆర్డర్లు వేయడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

3 /9

మహిళలకు ఉచితంగా చీరతోపాటు పురుషులకు పట్టు ధోతి ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

4 /9

జనవరి 10వ తేదీలోపు రేషన్ దుకాణాలకు ఉచిత ధోతీ, చీరలను పంపాలని తమిళనాడు హస్తకళల శాఖ ఆదేశించింది.

5 /9

చౌకధర దుకాణాల ద్వారా పొంగల్ కానుక అందించనుంది. ప్యాకేజీలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మూడు ప్రత్యేక వస్తువులు అందనున్నాయి.

6 /9

పొంగల్ కానుకలో పండుగకు అవసరమైన బియ్యం, బెల్లం, చెరకు సెట్లు ఉంటాయి. సెట్‌తోపాటు మహిళలకు చీర.. పురుషులకు ధోతి అందించనున్నారు.

7 /9

2025 సంవత్సరానికి రూ.1,77,06,476 ధోతీలు, రూ.1,77,22,905 చీరల తయారీకి ప్రభుత్వం ఆర్డర్లు వేసింది. దీనికోసం రూ.100 కోట్లు కేటాయించింది.

8 /9

ఈ పరిస్థితిలో జనవరి 10వ తేదీలోగా రేషన్ షాపులకు ఉచితంగా చీరలను పంపించాలని చేనేత శాఖ ఆదేశాలు జారీ చేయడంతో 2.50 లక్షల మంది నేత కార్మికుల నుంచి అందిన ఉచిత చీరలను గోదాము, రేషన్ షాపులకు పంపించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

9 /9

ప్రభుత్వం అందిస్తున్న సంక్రాంతి కానుకతోపాటు పట్టువస్త్రాలు అందిస్తుండడంతో పేద ప్రజల్లో సంక్రాంతి వెలుగులు రానున్నాయి.