ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ( Chandrababu Naidu ) రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటు విమర్శలు చేశాడు. 5 ఏళ్ళూ చంద్రబాబు నిద్రపోవడం వల్లే ప్రాజెక్టులు ముందుకు సాగలేదు అని విమర్శిచాడు అనిల్ ( AnilKumar Yadav ). చంద్రబాబు  పాలనలో నిర్వాసితులకు ఆర్‌అండ్ఆర్‌ ఇవ్వకుండా ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేశారన్నారు.



అదే సమయంలో ప్రాజెక్టుల నిర్వాసితులకు మంచి ప్యాకేజీ ఇచ్చి.. సీఎం జగన్ గారు ఉదారతతో వ్యవహరిస్తున్నారని తెలిపారు.  గండికోటలో 26 టిఎంసిలు నిల్వ చేయలేకపోవడానికి చంద్రబాబు అసమర్థతే కారణం అన్నారు.



వైఎస్ జగన్ ( CM Jagan ) ప్రభుత్వం వచ్చాక గండికోటకు రూ.970 కోట్లు కేటాయించింది అని..గ్రామాలు ఖాళీ చేయకుండా.. గండికోట నిర్వాసితులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారన్నారు అనిల్.  రాయలసీమకు ( Rayalaseema )నీరు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు అని ఘాటుగా విమర్శించారు.


వైఎస్ జగన్ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎంలలో 3,4 స్థానాల్లో ఉన్నారు అని.. చంద్రబాబు మాటల మనిషి అయితే.. జగన్ గారు చేతల సీఎం అని విమర్శించారు అనిల్ కుమార్ యాదవ్.