శిరోముండనం కేసు (Head Shaving Case)లో నిందితుడిగా ఉన్న నిర్మాత నూతన్ నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకోవడం (Nuthan Naidu Arrested) తెలిసిందే. తాజాగా నూతన్ నాయుడు మరో కేసులో ఇరుక్కున్నాడు. ప్రముఖ వ్యక్తి పేరుతో ఫోన్ చేసిన నూతన్ నాయుడు.. వైద్య పరీక్షల రిపోర్టులు మేనేజ్ చేసేందుకు యత్నించాడని సుజాత అనే మహిళ డాక్టర్ ఫిర్యాదుతో పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన భార్య మెడికల్ రిపోర్టులో వివరాలు మార్పించేందుకు యత్నించాడంటూ డాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. #SareJahanSeAccha: భారత్ ఖ్యాతిని చాటి చెప్పే జీ హిందుస్తాన్ స్పెషల్ ఈవెంట్ 
Telangana: తాజాగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు


శిరోముండనం కేసుతో ఒక్కసారిగా నూతన నాయుడు, ఆయన భార్య వార్తల్లోకెక్కారు. అక్కడినుంచి వరుసగా నూతన్ నాయుడు చేసిన మోసాలు, వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ పేరుతో ఫేక్ కాల్స్ చేశాడన్న ఫిర్యాదుతో ఇదివరకే నూతన్ నాయుడుపై కేసు నమోదైంది. కంచరపాలెంలోనూ బాధితుడి ఫిర్యాదుతో చీటింగ్ కేసు నమోదైంది. శిరోముండనం కేసు కాకుండా నూతన్ నాయుడుపై మరో నాలుగు కేసుల వరకు నమోదు కాగా, పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. Harsh Vardhan: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఇంట విషాదం 
Bigg Boss Telugu 4 Promo: ‘మాస్క్ ముఖానికి అవసరం.. ఎంటర్‌టైన్మెంట్‌కు కాదు’