Telangana: తాజాగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో తాజాగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు (COVID19 Cases In Telangana) నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 32,553 కరోనా యాక్టివ్ కేసులున్నాయని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

Last Updated : Sep 6, 2020, 10:54 AM IST
Telangana: తాజాగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో తాజాగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (COVID19 Cases In Telangana) 1,40,969కి చేరింది. శనివారం ఒక్కరోజే 9 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 886కు చేరుకుంది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. India: 70 వేలు దాటిన కరోనా మరణాలు

శనివారం 62,736 శాంపిల్స్ పరీక్షించగా 2,574 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, చికిత్స అనంతరం కోవిడ్19 మహమ్మారి బారి నుంచి 1,07,530 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,553 కరోనా యాక్టివ్ కేసులున్నాయని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. Bigg Boss Telugu 4 Promo: ‘మాస్క్ ముఖానికి అవసరం.. ఎంటర్‌టైన్మెంట్‌కు కాదు’

Trending News