Antarvedi: నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభం
అంతర్వేది ఆలయం నూతన రథం నిర్మాణానికి ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టింది. రథం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నాణ్యమైన వందేళ్ల బస్తర్ టేకుతో పనులు మొదలయ్యాయి.
అంతర్వేది ఆలయం నూతన రథం ( Antarvedi temple new chariot ) నిర్మాణానికి ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టింది. రథం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నాణ్యమైన వందేళ్ల బస్తర్ టేకుతో పనులు మొదలయ్యాయి.
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని రథశాలలో ఉన్న రథం ( Chariot burnt ) దగ్దమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కల్గించింది. కేసు దర్యాప్తును సీబీఐ ( Case handed over to CBI ) కు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) నూతన రథం నిర్మాణానికి చర్యలు చేపట్టింది. నూతన రథంతో పాటు రథశాల మరమ్మత్తుల కోసం 95 లక్షల రూపాయల్ని కేటాయించింది. ఇప్పుడు తాజాగా నూతన రథం నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనుల్ని ప్రారంభించారు. వచ్చే ఏడాది స్వామి కళ్యాణోత్సవం నూతన రథంపై జరగాలని ప్రభుత్వం ఆదేశించడంతో హుటాహుటిన పనుల్ని మొదలెట్టారు.
నూతన రథం నిర్మాణం కోసం 21 అడుగుల పొడుగు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి..వందేళ్లకు పైబడి వయస్సు కలిగిన నాణ్యమైన బస్తర్ టేకు కావల్సి వచ్చింది. వాస్తవానికి ఇలాంటి నాణ్యత కలిగిన టేకు రాష్ట్రంలో ఎక్కడా లభించలేదు. చివరికి కోనసీమలోనే ఉన్న రావులపాలెం టింబర్ యార్డులో ఇలాంటి కలపను గుర్తించగలిగారు. ఇవాళ ఉదయం పది గంటలకు ముహూర్తం నిర్ధారించి ఆ కలపను కోయించే పనులు మొదలెట్టారు అధికారులు. రథం నిర్మాణానికి మొత్తం 1330 ఘనపుటడుగుల కలప వినియోగించనున్నారు.
పాతరథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం డిజైన్ ( New Chariot design ) ను దేవాదాయ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్థుల్లో ఆలయం ఉండనుంది. Also read: AP TDP: షాక్ ఇవ్వనున్న మరో ఎమ్మెల్యే, ఆ ముగ్గురి బాటలోనే..