APEAPCET 2024 Exams: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. దాంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాల్లో ప్రవేశం కల్పించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్ ఇలా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలు మే 13 నుంచి మే 19 వరకూ జరగాల్సి ఉంది. కానీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కారణంగా పరీక్ష షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశ పరీక్ష మే 16, 17 తేదీల్లో జరగనున్నాయి. ఇక ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష సెషన్ 1 మే 18న, సెషన్ 2 మాత్రం మే 20, 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏపీ పీజీ సెట్ ప్రవేశ పరీక్ష జూన్ 3 నుంచి 7వ తేదీ వరకూ జరగాల్సి ఉండగా జూన్ 10, 11, 12, 13, 14 తేదీల్లో జరపనున్నారు. 


మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలలయా్లో పీహెచ్‌డి సీట్ల భర్తీకై నిర్వహించే ఆర్ సెట్ షెడ్యూల్ ఖరారైంద. ఈ పరీక్షలను మే 2 నుంచి మే 5 వరకూ నిర్వహించనున్నారు. 


అటు తెలంగాణలో కూడా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 పాలిసెట్ వాయిదా పడింది. మే 17న జరగాల్సిన పాలిసెట్ పరీక్షను మే 24న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 22 వరకూ ఆన్‌లైన్ ప్రక్రియలో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. 


Also read: Teaser Dialogues: పవన్‌కు ఎన్నికల సంఘం షాక్‌.. టీజర్‌లో 'గాజు గ్లాస్‌' డైలాగ్స్‌పై ఈసీ స్పందన ఇదే!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook