ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో స్పీకర్ కోడెల సభను ప్రారంభించారు. ఈ సందర్భంగ నీటి ప్రాజెకుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు  మంత్రి దేవినేని సమాధానమిచ్చారు. మారుమూల ప్రాంతంలో ఉన్న భూములకు నీరు అందించడమే లక్ష్యంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి 83 టీఎంసీలు రావడం జరిగిందని తెలిపారు. దీని వల్ల కృష్ణా డెల్టా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. సముద్రంలో వృథాగా పోతున్న నీటిని మాతమ్రే మళ్లిస్తున్నామని మంత్రి దేవినేని వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతిపక్షం లేకుండానే సభ ప్రారంభం


ప్రతిపక్ష పార్టీ వైసీపీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రతిపక్షం లేకుండా ఈ సారి సమావేశాలు జరుగుతున్నాయి. టీడీపీ సభ్యులుతో పాటు మిత్రపక్షమైన బీజేపీ సభ్యులు మాత్రమే సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రతిపక్షాలు లేకపోవడం సభకు ఎలాంటి అంతరాలు లేకుండా జరుగుతోంది.