AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..?
AP Assembly Monsoon Session: ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి 23 వరకు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
AP Assembly Monsoon Session: ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం దాదాపుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికకు అసెంబ్లీలో ఓటింగ్ ఉన్నందునా.. ఆ తర్వాతి రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం లేదా 19వ తేదీన బీఏసీ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సభ ఎన్ని రోజులు జరిగేది.. ఏయే అంశాలపై చర్చించేది ఈ సమావేశం తర్వాత క్లారిటీ రానుంది.
బీఏసీ సమావేశాలు జరిగే రోజునే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్‌గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అంశాలు :
మూడేళ్ల పాలనలో అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది నివేదికను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రజల ముందు పెట్టే అవకాశం ఉంది. గడిచిన మూడేళ్లలో సంక్షేమానికే పెద్ద పీట వేసిన ప్రభుత్వం.. రాబోయే రెండేళ్లలో అభివృద్దిపై ఫోకస్ పెట్టే అవకాశం లేకపోలేదు. దీనికి సంబంధించిన బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశాల్లో రాజధాని అంశం చర్చకు వస్తుందా లేదా చూడాలి.
Also Read: KCR VS BJP: కేసీఆర్ పై మొదలైన కేంద్రం యాక్షన్.. రూ.19వేల కోట్లు కోత! ఉద్యోగులకు జీతాలు ఇచ్చేదెలా.. ?
Also Read: Covid Cases: దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. ప్రమాదకరంగా పాజిటివిటి రేట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook