KCR VS BJP: కేసీఆర్ పై మొదలైన కేంద్రం యాక్షన్.. రూ.19వేల కోట్లు కోత! ఉద్యోగులకు జీతాలు ఇచ్చేదెలా.. ?

KCR VS BJP: ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కేసీఆర్ సర్కార్. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ప్రతి నెలా ఆర్బీఐ దగ్గర కొత్తగా అప్పు తెస్తేనే కాని జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోను కోతలు పెడుతోంది. ఆర్థిక లోటుతో తల్లడిల్లుతున్న కేసీఆర్ సర్కార్ తాజాగా బిగ్ షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం.

Written by - Srisailam | Last Updated : Jul 6, 2022, 09:59 AM IST
  • కేసీఆర్ ను టార్గెట్ చేసిన మోడీ సర్కార్
  • అపుల్లో 19 వేల కోట్ల రూపాయలు కోత
  • అప్పు లేకుంటే ఉద్యోగుల జీతాలు కష్టమే
KCR VS BJP: కేసీఆర్ పై మొదలైన కేంద్రం యాక్షన్.. రూ.19వేల కోట్లు కోత! ఉద్యోగులకు జీతాలు ఇచ్చేదెలా.. ?

KCR VS BJP: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్  ఓ రేంజ్ లో సాగుతోంది. కొన్ని రోజులుగా కేంద్ర సర్కార్ ను టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్. ప్రధాని మోడీపై వ్యక్తిగతంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తే.. కమలానికి కౌంటర్ గా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ లో బీజేపీకి ధీటుగా గులాబీ జెండాలు పెట్టించారు. బీజేపీ అగ్రనేతలను రెచ్చగొట్టేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారనే టాక్ వచ్చింది. కేసీఆర్ తీరుపై కేంద్ర పెద్దలు గుర్రుగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర సర్కార్  తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చుక్కలు చూపించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమైందని తెలుస్తోంది.

ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కేసీఆర్ సర్కార్. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ప్రతి నెలా ఆర్బీఐ దగ్గర కొత్తగా అప్పు తెస్తేనే కాని జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోను కోతలు పెడుతోంది. ఆర్థిక లోటుతో తల్లడిల్లుతున్న కేసీఆర్ సర్కార్ తాజాగా బిగ్ షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో సేకరించ తలపెట్టిన బడ్జెట్ రుణాల్లో ఏకంగా 19 వేల కోట్ల రూపాయలకు కోత పెట్టింది. పవర్ ప్రాజెక్టులకు మినహాయించి మిగితా కార్పొరేషన్ల పేరుతో తెలంగాణ సర్కార్ తీసుకోవాలనుకున్న గ్యారంటీ అప్పులకు ఛాన్స్ లేకుండా చేసింది. 2022-23 బడ్డెట్ లో  రూ.52,167 కోట్లు అప్పు  తీసుకోవాలని కేసీఆర్ సర్కార్ ప్రణాళికలు వేసింది. ఇందులో ఇప్పటికే రూ.10వేల కోట్ల అప్పును సేకరించింది. సెక్యూరిటీ బాండ్ల తనఖా ద్వారా  మంగళవారం కూడా 3 వేల కోట్ల రుణం తీసుకుంది కేసీఆర్ సర్కార్.  

కేసీఆర్ సర్కార్ అప్పులపై ఇన్నిరోజులు కొంత సాఫ్ట్ గా ఉన్న మోడీ సర్కార్.. తాజాగా స్టాండ్ మార్చింది. గత రెండేళ్ల బడ్జెట్‌ అప్పుతోపాటు గ్యారంటీ అప్పులను కూడా ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోకి తీసుకొచ్చింది. పరిమితికి మించి చేసిన అప్పును లెక్కించి ఈ ఏడాది బడ్జెట్‌ అప్పుల్లో కోత పెడాతమంటూ ఆంక్షలు విధించింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధన ప్రకారం జీఎస్డీపీలో 3.5 శాతం అంటే రూ.42,728 కోట్లే ఈ ఏడాది అప్పు చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి అర్హత ఉందని కేంద్రం లేఖ రాసింది.ఈ లెక్కన కేసీఆర్ సర్కారు బడ్జెట్‌ అంచనా అప్పులో రూ.19 వేల కోట్ల దాకా కోత పడనుంది.బడ్జెట్ అంచనా  రూ.52,167 కోట్లలో రూ.19 వేల కోట్లు తగ్గితే.. దాదాపు 34 వేల కోట్ల రూపాయలకు వరకు ఈ ఏడాది అప్పు తీసుకునే అవకాశం ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.

కేంద్ర సర్కార్ తాజా నిర్ణయంతో 19 వేల కోట్ల రూపాయలకు కోత పడనుండటంతో తెలంగాణ సర్కార్ కలవరపుతోంది. కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. కావాలనే కొత్తగా ఆంక్షలు పెడుతోందని ఆరోపిస్తోంది. అప్పుల్లో కోత పడిన డబ్బులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. అప్పులు సేకరించకపోతే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం కష్టం. అందుకే పన్నుల ద్వారానే సమీకరించుకునే పరిస్థితులు ఉన్నాయంటున్నారు నిపుణులు.

Read also:Covid Cases: దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. ప్రమాదకరంగా పాజిటివిటి రేట్..

Read also: GAS PRICE HIKE: సామాన్యులకు మరో షాక్.. 50 రూపాయలు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News