Ap Assembly live updates: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సంతాప తీర్మానాలతో సమావేశాలు మొదలయ్యాయి. ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం ప్రకటించి..ఆయన చేసిన సేవల్ని కొనియాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా ( Corona ) కాలంలో రెండోసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ( Ap Assembly session ) మొదలయ్యాయి. ఐదురోజుల పాటు శీతాకాల సమావేశాలు జరపాలని నిర్ణయించారు.ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతూనే..రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) మృతికి సంతాపం ప్రకటించారు. 5 దశాబ్దాలుగా దేశానికి ఆదర్శవంతమైన సేవల్ని అందించారని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. స్వతంత్రంగా వ్యవహరించి..పదవిని వన్నె తెచ్చారన్నారు. 


ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌, డాక్టర్‌ రవీంద్ర రాజు, కె. చంద్రమోహన్‌, పైడికొండల మాణిక్యాలరావు, పి. అమ్మిరాజు, భమిడి నారాయణస్వామి, కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు, బల్లి దుర్గాప్రసాదరావు, మంగపతిరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, మోచర్ల జోహార్‌, కందుల శివానందరెడ్డి, వైటీ రాజా, డీకే సత్యప్రభలకు శాసనసభ సంతాపం తెలిపింది.


సంతాప తీర్మానాలు ఆమోదించిన తర్వాత శాసనసభ ( Assembly ) ను స్పీకర్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ( Speaker Tammineni sitaram ) కొద్దిసేపు వాయిదా వేశారు. టీ విరామం తర్వాత స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం వైఎస్ జగన్ ( Ap cm ys jagan ), మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి.. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హాజరుకాలేదు. నివర్ తుపాను నష్టంపై చర్చించాలని యనమల రామకృష్ణుడు కోరగా... చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి  బొత్స సత్యనారాయణ తెలిపారు. బీఏసీలో నిర్ణయం తీసుకుని సభలో చర్చిద్దామన్నారు.


కరోనాతో బాధపడుతూ మరణించిన ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. ఎస్పీ గౌరవార్ధం నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్  ప్రభుత్వ పాఠశాలకు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Also read: AP: ఏపీలో మూడ్రోజులపాటు అతి భారీ వర్షాలు