AP Assembly Winter Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాల్ని ఒకరోజు కాకుండా 9 రోజులపాటు నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయించింది. ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల తొలిరోజు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(AP Assembly Winter Sessions)ఇవాళ ప్రారంభమయ్యాయి. ముందుగా అనుకున్నట్టు ఒకరోజు కాకుండా 9 రోజులపాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 వ తేదీవరకూ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రారంభమైన తొలిరోజు సమావేశంలో ఇటీవల మృతి చెందిన ప్రజా ప్రతినిధులకు సంతాపం ప్రకటించారు. బద్వేలు ఉపఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే డాక్టర్ సుధతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రమాణ స్వీకారం చేయించారు.


అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం(Ap government) పలు తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. బీసీ జనగణన తీర్మానాన్ని రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ తీర్మానం ఆమోదించి..కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. దేశవ్యాప్తంగా బీసీ జన గణన చేపట్టాలనే డిమాండ్ నేపధ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల వారీగా జనాభాను లెక్కించాల్సిన ప్రాధాన్యత, రిజర్వేషన్లు, తదితర అంశాలను తీర్మానంలో పొందుపర్చనున్నారు. మరోవైపు ఏపీ సినిమాటోగ్రఫీ చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. అలాగే మహిళా సాధికారతపైనా అసెంబ్లీలో చర్చ జరగనుంది. వీటితో పాటు పలు కీలకమైన బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అలాగే సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపై సభలో చర్చ జరగనుంది.


బీఏసీ సమావేశం వివరాల్ని ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి(Sirkanth Reddy) వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో ప్రతిపక్షం చెప్పినట్లే చేస్తున్నామని  తెలిపారు. గతంలో బీఎసిలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వని పరిస్థితులు ఉండేవని.., ఇపుడు మాత్రం ప్రతిపక్షం మాటే విన్నామన్నారు. కరోనా కారణంగా ఒక్కరోజు మాత్రమే నిర్వహించాలని తొలుత భావించామని..అయితే బీఏసీలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు సమావేశాలు నిర్వహించాలని కోరడంతో.. తక్షణం సమావేశాలు పొడిగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నెల 26 తేదీ వరకు వివిధ అంశాలపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 


Also read: వివేకానందరెడ్డి హత్యకేసులో ఇంకెవరి ప్రమేయముంది, శంకర్ రెడ్డి లేఖ సారాంశమేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook