Insider trading: ఇన్‌సైడర్ ట్రేడింగ్. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్షనేత ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నోట ప్రముఖంగా విన్పించిన మాట. అసలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి..అమరావతి భూకుంభకోణంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందా..ఆధారాలేంటి..పాల్పడ్డ ప్రముఖులెవరు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో వచ్చిన తెలుగుదేశం పార్టీ అమరావతి (Amaravati) ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించింది. నూతన రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ పేరుతో 30 వేల ఎకరాలు సేకరించింది. ల్యాండ్ పూలింగ్ వ్యవహారం, రాజధాని ప్రకటన చుట్టూ వేలాది ఎకరాల భూకుంభకోణం జరిగిందనేది నాటి ప్రతిపక్షం ఇప్పటి అధికార పార్టీ ఆరోపణ. అధికారంలో ఉన్నందున సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌(Insider trading)కు పాల్పడ్డారని నాడు ప్రతిపక్షాలు ఆరోపించడమే కాకుండా..2019లో అధికారంలో రాగానే వైఎస్ జగన్ ప్రభుత్వం( Ys jagan government) అమరావతి భూకుంభకోణంపై మంత్రివర్గ ఉపసంఘంతో దర్యాప్తు కమిటీ వేసింది. 


ప్రజా ప్రతినిధులుగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అధికారంలో ఉన్నందున లభించే సమాచారాన్ని ఎవరికీ చెప్పమని..అధికార దుర్వినియోగం చేయమని ప్రమాణం చేస్తుంటారు. ఓ సంస్థ లేదా వ్యవస్థ లేదా కంపెనీకు సంబంధించిన ముందస్తు సమాచారం ఆధారంగా లబ్ది పొందితే దాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటే చేసిన ప్రమాణాన్ని పక్కనపెట్టినట్టే. గత ప్రభుత్వం ఇదే చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ఆరోపించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిగ్గు తేల్చింది. సమగ్ర నివేదిక( Comprehensive report) ను ప్రభుత్వానికి అప్పగించింది. 


ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు ఆధారాలు సేకరించిన కేబినెట్ సబ్ కమిటీ


అమరావతి భూముల వ్యవహారంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు ఆధారాలు సేకరించినట్టు మంత్రివర్గ ఉపసంఘం ( Cabinet sub committee) చెబుతోంది. బినామీలు, నేతల భూములకు మేలు చేసేలా రాజధాని ఏర్పాటు జరిగిందని నివేదికలో తెలిపింది. టీడీపీ నేతలు, తెల్ల రేషన్ కార్డుదారుల్ని బినామీలుగా చూపించారని.మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ భూముల కొనుగోళ్లు జరిపినట్టు నివేదికలో పేర్కొంది. 4 వేల 70 ఎకరాల్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరిట కొనుగోలు చేసినట్టు సబ్ కమిటీ గుర్తించింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ నేతలు, పలువురు ప్రముఖులు సైతం ఉన్నారని నివేదికలో తెలిపింది. 


Also read: TDP Chief Chandrababu: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు AP CID నోటీసులు


ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసిందెవరు


అమరావతి భూముల కుంభకోణం ( Amaravati land scam) వ్యవహారంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్( Insider trading) ‌కు పాల్పడిన ప్రముఖుల జాబితాను మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో బహిర్గతం చేసింది. ఆ ప్రముఖలు పేర్లివే.


నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu), నారా లోకేష్ (Nara lokesh)స్నేహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత ( Paritala sunita), మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు , లింగమనేని రమేశ్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, లంకా దినకర్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు, పుట్టా మహేశ్ యాదవ్ ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, అతని కుమారుడు నారా లోకేష్ బినామీ వ్యవహారాల గురించి మంత్రివర్గ ఉపసంఘం బయటపెట్టింది. వేమూరు రవికుమార్ పేరుతో లోకేష్ 62.77 ఎకరాలు కొనుగోలు చేసినట్టు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది.


Also read: Amaravati land scam: అమరావతి భూకుంభకోణంలో మంత్రివర్గ ఉపసంఘం ఏం తేల్చింది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook