Amaravati land scam: అమరావతి భూకుంభకోణంలో మంత్రివర్గ ఉపసంఘం ఏం తేల్చింది

Amaravati land scam: ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి భూ కుంభకోణంపై మంత్రివర్గ ఉపసంఘం దర్యాప్తు పూర్తయింది. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో మంత్రివర్గ ఉపసంఘం ఏం చెప్పింది..ఆ వివరాలేంటి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2021, 01:33 PM IST
  • అమరావతి భూ కుంభకోణంలో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించిన మంత్రివర్గ ఉపసంఘం
  • నివేదిక ఆధారంగా చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు
  • టీడీపీ నేతలు, బినామీల కోసం సీఆర్డీఏ పరిధి మార్చారని, రికార్డులు తారుమారు చేాశారని గుర్తించిన ఉపసంఘం
Amaravati land scam: అమరావతి భూకుంభకోణంలో మంత్రివర్గ ఉపసంఘం ఏం తేల్చింది

Amaravati land scam: ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి భూ కుంభకోణంపై మంత్రివర్గ ఉపసంఘం దర్యాప్తు పూర్తయింది. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో మంత్రివర్గ ఉపసంఘం ఏం చెప్పింది..ఆ వివరాలేంటి..

ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అమరావతి భూ కుంభకోణం (Amaravati land scam )వ్యవహారంపై మంత్రివర్గ ఉపసంఘం దర్యాప్తు పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా సీఐడీ (CID) అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌(Insider trading) కు పాల్పడిన ప్రముఖుల జాబితాను నివేదిక వెల్లడించింది. రాజధాని ప్రకటన విషయంలో ముందస్తు సమాచారంతో భూముల్ని కొనుగోలు చేసినట్టు మంత్రివర్గం తెలిపింది. క్యాపిటల్ సిటీ రీజియన్లో భూముల్ని కొనుగోలు చేసినట్టు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేసినట్టు నివేదికలో స్పష్టమైంది. టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేకూరేలా చంద్రబాబు ప్రభుత్వం రాజధాని సరిహద్దులపై నిర్ణయం తీసుకుందని నివేదికలో మంత్రి వర్గ ఉపసంఘం (Cabinet sub committee )స్పష్టం చేసింది. పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్టు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించారు. భూ కేటాయింపుల్లో చద్రబాబు ( Chandrababu) ప్రభుత్వం పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంది. 1989 ఎస్సీ ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపింది. 

టీడీపీ (TDP) నేతల కోసం సీఆర్డీఏ పరిధి మార్చినట్టు మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. నేతల భూముల కోసం చంద్రబాబు ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసిందని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. సీఆర్డీయే పరిధిలో 524.545 ఎకరాల భూముల కోసం సరిహద్దులు మార్పేశారని.. బాలక్రిష్ణ వియ్యంకుడి సంస్థ వీబీసీ కెమికల్స్‌కు భూముల కేటాయించారని నివేదికలో ఉంది. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498 ఎకరాల కేటాయించి..తరువాత సీఆర్డీఏ పరిధి మారుస్తూ జీవో జారీ చేశారని ఉపసంఘం నివేదికలో ఉంది. 

Also read : TDP Chief Chandrababu: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు AP CID నోటీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News