COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


AP: రాష్ట్ర వ్యాప్తంగా కలవరం కల్గించిన ఏలూరు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏలూరులో తక్షణం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వ వైఫల్యమే వ్యాధులకు కారణమని ఆరోపించారు.


ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వింత వ్యాధి అంతు చిక్కింది. నీటి ద్వారా శరీరంలో వెళ్లిన సీసం, నికెల్ వంటి భార లోహాలే వ్యాధికి కారణమని ప్రాధమికంగా నిర్ధారణైంది. రాష్ట్ర వ్యాప్తంగా కలవరం కల్గించిన ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏలూరులో తక్షణం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలంంటూ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాాశారు. ఏలూరులో బాధితుల సంఖ్య పెరగడం, వింతవ్యాధిగా ప్రచారం సాగడంతో జనం భయపడుతున్నారన్నారు. సురక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం విషయంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. 


ప్రజలకు మేలు చేసే సీఎంగా కంటే పన్నుల సీఎంగా జగన్ మారారని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. స్థానిక, జమిలి ఎన్నికలకు కార్యకర్తలు, నేతలు సిద్ధంగా ఉండాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో టాయిలెట్లతో పాటు రోడ్లపై కూడా పన్నులు విధిస్తున్నారన్నారు. చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యాన్ని పరిగణలో తీసుకుని ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి మరికొన్ని సూచనలు చేశారు. క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేసిన తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ మినరల్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షిత నీరు అందించాలన్నారు. ప్రతి బాధితునికి ఆరోగ్య భీమా, జీవిత భీమా ప్రభుత్వమే కల్పించాలన్నారు. Also read: AP: ప్రజా ప్రయోజనాలున్నప్పుడు...కోర్టులు జోక్యం చేసుకోవడం తగదు