ఈ నెల 8, 9 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరగబోయే వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ఆయన పాల్గొననున్నారు. ఆయన వెంటనే సీఆర్‌డీఏ అధికారులు కూడా వెళ్తున్నారు. ఈ సదస్సులో చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి గురించి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే చంద్రబాబు సింగపూర్‌లో జరిగే ప్రపంచ మేయర్ల ఫారంలో కూడా ప్రసంగించనున్నారు. ఈ సదస్సుల్లో పాల్గొనడంతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు, ప్రముఖులతో కూడా చంద్రబాబు ఈ పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడకు వచ్చే ప్రతినిధులకు అమరావతి గురించి తెలియజేసేందుకు ఒక పెవిలియన్‌ను ప్రదర్శించనుంది.


ఈ సారి వరల్డ్ సిటీస్ సమ్మిట్‌‌కి అనేకమంది ప్రముఖలు హాజరుకానున్నారు. త్యాన్ మింట్ (వాణిజ్యశాఖ మంత్రి, మయన్మార్), చౌ కోన్ యోవ్ (ముఖ్యమంత్రి, పెనాంగ్), డాక్టర్ వివియన్ బాలక్రిష్ణన్ (విదేశాంగ మంత్రి, సింగపూర్), ప్రేమదాస సజిత్ (హౌసింగ్ శాఖ మంత్రి, శ్రీలంక). హజియా అలియా మహామా (గ్రామీణశాఖ మంత్రి, ఘానా) మొదలైన వారు ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.