Ysrcp Election Campaign: వైనాట్ 175 లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై ఏపీ నీడ్స్ జగన్ అనే మరో వినూత్న కార్యక్రమం చేపట్టనుంది. మరోవైపు రేపు భారీగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రతినిదుల భేటీతో ఎన్నికల శంఖారావం ప్రకటించనున్నారని సమాచారం. మరోసారి అధికారం సాధించేందుకు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాలు ఓవైపు, టీడీపీ-జనసేన పొత్తు మరోవైపు రాజకీయాల్లో మార్పులకు కారణమౌతోంది. ఎవరెన్ని కూటములు కట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగానే బరిలో దిగనుంది. వైఎస్ జగన్ ముందు నుంచే చెబుతున్నట్టు వైనాట్ 175 లక్ష్యం దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు, నేతలకు వివిధ సందర్భాల్లో వివిధ కోణాల్లో దిశా నిర్దేశం చేశారు. గడప గడపకు కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల్లో ఉండాలని సూచిస్తూ వస్తున్నారు. పనితీరు బాగుంటేనే టికెట్ ఇస్తానని చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. 


ఈ నెల 9వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్డేడియంలో పార్టీ ప్రతినిధుల సభను పెద్దఎత్తున నిర్వహిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్  పార్టీ ప్రతినిదులు, నేతలు, కో ఆర్డినేటర్లు, ఎమ్మల్యేలు, మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. దాదాపు 8 వేలమందితో ఈ సభ ఉంటుందని తెలుస్తోంది. ఈ సభ ద్వారా వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని సమాచారం. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పలు కీలకాంశాలపై జగన్ సూచనలు ఇవ్వనున్నారు. ఈ భేటీ వేదికగా వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై చర్చించనున్నారు. ఈ నినాదాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయనున్నారు. 


రేపు ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభమై మద్యాహ్నం వరకూ కొనసాగనుంది. ఎన్నికలకు సిద్ధమయ్యే విషయంలో పార్డీ నేతలకు జగన్ కీలక సూచనలు చేసే అవకాశముంది. ఇప్పట్నించే నిత్యం ప్రజల్లో ఉంటే వైనాట్ 175 లక్ష్యాన్ని చేరుకోవచ్చనేది వైఎస్ జగన్ ఆలోచనగా ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది.


Also read: TDP Candle Rally: 'కాంతితో క్రాంతి' నిరసనలో పాల్గొన్న భువనేశ్వరి, బ్రాహ్మిణి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook