జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గురువారం ఉదయం పార్టీ ఎంపీలు, సమన్వయ కమిటీ సభ్యులతో  చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పవన్ వ్యాఖ్యలను ఖండించారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనపెట్టి టీడీపీని టార్గెట్‌ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ తో నాటకం ఆడిస్తున్నారు
పవన్‌ కళ్యాణ్‌ తనపై చేసిన అవినీతి ఆరోపణలు అర్థరహితమని చంద్రబాబు పేర్కొన్నారు. 2013 నివేదిక ఆధారంగా ఏపీని అవినీతి రాష్ట్రం అనడం ఏంటని ప్రశ్నించారు. తెర వెనుక ఉండి  కొందరు పవన్‌తో ఇలా నాటకం ఆడిస్తున్నారని  అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి పనికిమాలిన కుట్రలో పవన్‌ పావు కావడం శోచనీయమన్నారు. ఇలాంటి లాలూచీ రాజకీయాలకు పవన్ తోడ్పాటు ఇస్తాడని తాము ఊహించలేకపోయామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు


అవినీతిపై పవన్ పచ్చి అబద్ధాలు


పవన్ ఆరోపిస్తున్నట్లు రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరగడం లేదని.. స్మగ్లర్లపై ఉ‍క్కుపాదం మోపి దాన్ని ఎప్పుడో నియంత్రించామని చంద్రబాబు వివరణ ఇచ్చారు. స్మగ్లింగ్ జరుగుతున్నట్లు సమాచారమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కడప ఫాతిమా కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ చేయలేదనడం పచ్చి అబద్ధమని చంద్రబాబు వెల్లడించారు.


 హోదా ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు


ప్రస్తుతం ప్రత్యేక హోదాపై పోరాటం జరుగుతుంటే పవన్ ఇలా పనికట్టుకొని తమపై నిందలు వేడయం వల్ల ఉద్యమం నీరుగారే అవకాశముందన్నారు. సంబంధంలేని విషయాలను తమకు  అంటగట్టడం సరికాదని పవన్ కు చంద్రబాబు హితవు పలికాడు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జరుగుతున్న పోరాటాన్ని తప్పుదోవ పట్టిస్తే ప్రజలే సమాధానం చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు.