KTR Chit Chat: ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో న్యాయస్థానం ఏం తీర్పు వస్తుందో చూద్దామని.. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో ఏసీబీది తప్పు.. ఆ ఎఫ్ఐఆర్ తప్పు అని స్పష్టం చేశారు. 7వ తేదీన ఈడీ విచారణకు హాజరుపై తమ న్యాయవాదులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదు మరోసారి చెప్పారు.
Also Read: Harish Rao: ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి: హరీశ్ రావు ఆగ్రహం
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో కేటీఆర్ పాల్గొని అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఫార్ములా ఈ కేసు, ఈడీ కేసు, పార్టీ కార్యక్రమాలపై కేటీఆర్ స్పందించారు. తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అని పేర్కొన్నారు. 'పాపం.. నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోంది. నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్ రెడ్డికి ఏమి దొరకటం లేదు. రూ.600 కోట్లు సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదు' అని కేటీఆర్ వివరించారు.
Also Read: KT Rama Rao: మన్మోహన్ సింగ్‌ను అవమానించిన రాహుల్ గాంధీ.. ఇది తగునా అంటూ కేటీఆర్ ఆగ్రహం
'జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు. రేసు కావాలని నేను నిర్ణయం తీసుకున్న.. వద్దనేది రేవంత్ నిర్ణయం. 'ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్ లో చర్చ జరగలేదు. నాపై కేసు పెడితే.. రేవంత్ రెడ్డిపై కూడా కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రినా?' అని ప్రశ్నించారు.
ఏప్రిల్‌లో భారీ బహిరంగ సభ
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ నిర్వహిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పార్టీ కార్యక్రమాలపై స్పందిస్తూ.. 'ఈ ఏడాది మెదటి హాఫ్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం. తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు పూర్తి చేస్తాం' అని తెలిపారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ వరకు సమయం ఉందని గుర్తుచేశారు. పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు.
'రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతు భరోసాతో రేవంత్‌పై ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది. రైతు భరోసా కొందరికే ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు? బ్యాంకులను ముంచేటోళ్లకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డికి లేదు. 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వమే కోర్టులో కేసులు వేయిస్తోంది. ఉద్యోగస్తులు, పాన్ కార్డ్ ఉన్నవాళ్ళకు రైతుబరోసా ఎగ్గొట్టే ప్రయత్నం' అని మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.