AP CM convoy Issue: ఆంధ్రప్రదేశ్ అధికారుల తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఈనెల 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించనున్నారు. అయితే జగన్ పర్యటన కోసం ఒంగోలు పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం రోడ్డుపై వెళుతున్న కార్లను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న శ్రీనివాస్ కారును పోలీసులు తీసేసుకున్నారు. తమను మధ్యలోనే ఆపేస్తే ఎక్కడికి వెళ్లాలని శ్రీనివాస్ పోలీసులతో వాదించాడు. అర్ధరాత్రి పిల్లలతో ఇబ్బంది పడతామని చెప్పినా పోలీసులు కరుణించలేదు. కారును పోలీసులు లాకెళ్లడంతో అర్థరాత్రి రోడ్డుపైనే ఉంది శ్రీనివాస్ కుటుంబం.  ఇంత చెప్పినా వినకపోవడంతో శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులను తీసుకుని
వెనక్కి వెళ్లిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల తీరుపై టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం RTA అధికారులు ప్రజల కారును బలవంతంగా తీసుకెళ్లడం ఏపీలో దారుణ పాలనకు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు చంద్రబాబు. కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ కారును రవాణాశాఖ అధికారులు లాక్కెళ్లడం అత్యంత దారుణమన్నారు. కుటుంబ సభ్యులతో వెళుతుండగా రోడ్డున పడేయాల్సిన అధికారం అధికారులకు ఎవరిచ్చారని చంద్రబాబు నిలదీశారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు తీసుకెళ్లడం సిగ్గుచేటైన విషయమన్నారు టీడీపీ అధినేత. 


మరోవైపు ఒంగోలు కారు లాక్కెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెళ్తున్న వాహనదారుడి కారు లాక్కోవడంపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ హోంగార్డ్ తిరుపతి రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్సిపెక్టర్ సంధ్యపై యాక్షన్ తీసుకోవాలని డీటీసీ కృష్ణవేణికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హోంగార్డును సొంత శాఖకు పంపిస్తూ డీటీసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఏఎంవీ సంధ్య పాత్రపై విచారణ జరుపుతున్నారు అధికారులు.


Also Read: Rohit-Bumrah: ప్రతిష్టాత్మక అవార్డుకు రోహిత్, బుమ్రా ఎంపిక.. కోహ్లీకి దక్కని చోటు!


Also Read: పట్టు వస్త్రంపై రామాయణం.. 32 వేల సార్లు 'జై శ్రీరామ్' నామం... చీరపై చేనేత కళాకారుడి అద్భుత డిజైన్..


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook