Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఒకే రోజు ఉంది. ఇద్దరికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో రాజకీయ బద్ద విరోధోలుగా ఉన్న సీఎం జగన్, చంద్రబాబు ఒకే వేదిక పంచుకుంటారని అంతా భావించారు. ఆ అరుదైన సన్నివేశం కోసం ఎదురుచూశారు. కాని తెలుగు ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. సీఎం జగన్ కూడా హస్తినకు వెళుతున్నారు. అయితే ఇద్దరు పాల్గొంటారని భావించిన సమావేశానికి మాత్రం సీఎం జగన్ దూరంగా ఉంటున్నారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ కు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది కేంద్ర సర్కార్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఏడాది పాటు వేడుకలు జరుపుతోంది. వేడుకల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలకు ఆహ్వానం అందింది. పీఎంవో ఆహ్వానంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కూడా ఖరారైంది. దీంతో ప్రధాని మోడీ సమావేశంలో సీఎం జగన్, చంద్రబాబు పాల్గొంటారని అంతా భావించారు. కాని చివరి నిమిషంలో సీన్ మారిపోయింది. సీఎం జగన్ ఢిల్లీకి వెళుతున్నా.. ప్రధాని మోడీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశానికి మాత్రం దూరంగా ఉంటున్నారు.


సాయంత్రం 4:30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోడీ అధ్యక్షతన ఆజాదీకా మహోత్సవ్ కమిటీ సమావేశం జరుగుతుండగా.. ఏపీ సీఎం జగన్ మాత్రం రాత్రి ఏడు గంటలకు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ నిర్వహించే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరవుతారు. నిజానికి జగన్ ఢిల్లీ టూర్ కు సంబంధించి మొదట వచ్చిన షెడ్యూల్ లో శనివారం ఉదయం జగన్ శ్రీకాకుళం వెళుతారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కొడుకు వివాహానికి హాజరవుతారు. తర్వాత విశాఖ చేరుకుని.. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాలి. కాని మొదట వచ్చిన  ఈ షెడ్యూల్ తర్వాత మారిపోయింది. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ రానున్నారు సీఎం జగన్. ఇక్కడ మరో మ్యారేజీ ఫంక్షన్ కు హాజరవుతారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం ఢిల్లీకి వెళతారు.


ప్రధాని మోడీ సమావేశానికి హాజరుకావాలని సీఎం జగన్ మొదట నిర్ణయించినా తర్వాత మార్చుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమంటున్నారు. ప్రధాని భేటీకి చంద్రబాబు వస్తుండటం వల్లే ఆ సమావేశానికి సీఎం జగన్ దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు పాల్గొంటున్న ప్రధాని సమావేశానికి  డుమ్మా కొట్టాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఢిల్లీకి  ఆలస్యంగా వెళుతున్నారని అంటున్నారు.


Also Read: India Corona Update: అదుపులోనే కరోనా వైరస్ వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే?


Also Read: రేపే ఎస్సై ప్రిలిమ్స్‌ ఎగ్జామ్.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook