CM Jagan on Probation: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ శుభవార్త చెప్పారు. జూన్ 30 నాటికి సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రక్రియను పూర్తి చేసుకొని.. జులై 1 నాటికి సచివాలయ ఉద్యోగులకు కొత్త జీతాలు అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ స్థానాల్లో భర్తీ చేయాలని సూచించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సచివాలయ ఉద్యోగుల్లో మిగిలిన 25 శాతం మంది కూడా ప్రొబేషన్ ఎగ్జామ్స్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే మార్చి మొదటి వారంలో ప్రొబేషన్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి.. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పై ఈ విధంగా స్పందించారు. 


పీఆర్సీపై ఆందోళనలపై సీఎం స్పందన


రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవలే అమలు చేసిన పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు చేపడుతున్నారు. ఈ నిరసనలపై సీఎం జగన్ స్పందనపై రివ్యూ కార్యక్రమంలో స్పందించారు. ఉద్యోగుల కోసం ముందుగా ప్రకటించిన పీఆర్సీనే అమలు చేశామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జరగాలనే వారి సర్వీసును పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు యుద్ధ ప్రాతిపదికను కారుణ్య నియామకాలను చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.  


Also Read: APSRTC Employees Strike: సమ్మె బాటలో ఆర్టీసీ ఉద్యోగులు.. ఏపీలో ఆ రోజు నుంచి బస్సులు బంద్?


Also Read: AP PRC Issue: ట్రెజరీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ మెమోలు.. ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవని వార్నింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook