CM Jagan Mohan Reddy: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ మాస్ కౌంటర్.. ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి..?
CM Jagan Counter To Pawan Kalyan: మూడు పెళ్లిళ్లపై ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమేమీ మాట్లాడిస్తున్నారో చూస్తున్నామన్నారు.
CM Jagan Counter To Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకోమని మాట్లాడితే మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు. గురువారం అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో రైతుల క్లియరెన్స్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.
'కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమేమీ మాట్లాడిస్తున్నారో చూస్తున్నాం.. మూడు రాజధానులు వలన రాష్ట్రానికి మేలు జరుగుతుందని మనం చెబుతుంటే.. మూడు పెళ్లిళ్లు వల్లనే మేలు జరుగుతుందని కొంత మంది మాట్లాడుతున్నారు. మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి.. ఒక్క జగన్ కొట్టడానికి ఇంత మంది ఏకం అవుతుంటే ఆశ్చర్యంగా ఉంది. మూడు పెళ్లిళ్లు చేసుకోమని మాట్లాడితే.. మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి..? కూతుళ్లు, చెల్లెమ్మల పరిస్థితి ఏంటి..? ఆడవాళ్ల మానప్రాణాలు ఏం కావాలి..? ఇలాంటి వారా నాయకులు..?
ఇది మంచికి మోసానికి జరుగుతున్న యుద్ధం. నేను దేవుడిని నమ్ముకున్నా.. అక్కాచెల్లెమ్మలను నమ్ముకున్నా.. దుష్టచతుష్టయం కుట్రలు, మోసాలు నమ్మొద్దు. ఎల్లో టీవీలు చూడొద్దు..
ఎల్లో పేపర్లు చూడొద్దు.. మీ ఇంట్లో సంక్షేమం, అభివృద్ది కొలమానంగా తీసుకోండి' అంటూ సీఎం జగన్ సూచించారు.
చుక్కల భూములకు పట్టాలు ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమని ముఖ్యమంత్రి అన్నారు. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే వారే చరిత్రలో నిలబడిపోతారన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా భూములకు సంబంధించి పక్కా రికార్డులు లేవని.. దీంతో ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ ఇబ్బందులను తొలగించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో భూముల రీసర్వేను ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నామని.. శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
రాష్ట్రంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలకు పరిష్కారం చూపించామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నవంబర్ నెలలో 1,500 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. సరిహద్దులు నిర్ణయించడంతో పాటు భూహక్కు పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలు గ్రామాల్లో అందుబాటులే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Also Read: TDP JANASENA AllAINCE: చంద్రబాబు సభలో జనసేన జెండాలు.. బీజేపీకి కీలక నేతల రాంరాం?
Also Read: Omicron Variant BF 7: దీపావళి వేళ అలర్ట్.. భయపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. లక్షణాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి